Tandav web series Dispute: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్‌సిరీస్‌పై వివాదం ప్రారంభమైంది. వెబ్‌సిరీస్‌లో హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశారనేది వివాదం సారాంశం. మహారాష్ట్ర బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..అసలేంటి వివాదం..ఏం ఉంది ఈ వెబ్‌సిరీస్‌లో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ ( Bollywood ) నటుడు సైఫ్ అలీఖాన్ ( Saif Ali khan ), డింపుల్ కపాడియా తదితరులు నటించిన వెబ్‌సిరీస్ తాండవ్ ( Tandav Web series ). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ( OTT Platform ) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇప్పుడీ వెబ్‌సిరీస్ చుట్టూ వివాదం ప్రారంభమైంది. ఈ వెబ్‌సిరీస్‌లో ఈశ్వరుడిని ఎగతాళి చేయడంతో పాటు హిందూ దేవుళ్లు, దేవతల్ని పరిహాసం  చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు బీజేపీ  నేతలు. మహారాష్ట్ర  బీజేపీ  ( Maharashtra Bjp ) నేతలు పోలీసులకు తాండవ్ వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ అమెజాన్ ప్రైమ్ ( Amazon prime ) ‌ను వివరణ కూడా కోరినట్టు సమాచారం. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాం కదమ్ ..వెబ్‌సిరీస్ క్రియేటర్లు, నటులు, డైరెక్టర్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


తాండవ్ వెబ్‌సిరీస్‌లో ఈశ్వరుడిని ఎగతాళి చేశారని ఎమ్మెల్యే రాం కదమ్ మండిపడ్డారు. అమెజాన్ ప్రైమ్ ( Amazon prime ), నెట్‌ఫ్లిక్స్ ( Netflix ) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై వెబ్‌సిరీస్‌ల ప్రదర్శనలో నియంత్రణ కోసం సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ కూడా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ ( Minister Prakash Jawadekar ) కు విజ్ఞప్తి చేశారు. 


Also read: Shruti Haasan: శృతిహాసన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook