కరోనావైరస్ ( Coronavirus ) వల్ల సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అంతర్జాతీయ షూటింగ్స్ కోసం దర్శకనిర్మాతలు ప్లాన్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ (Prabhas ) హీరోగా వస్తున్న రాధేశ్యామ్ టీమ్ కూడా యూరోప్ చేరుకుని షూటింగ్ మొదలుపెట్టేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read: పెళ్లికి ముందు Virat Kohli డేటింగ్ చేసిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా?


అదే సమయంలో పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం అవనున్నట్టు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు చంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్ కాగా.. మూవీని తెలుగు, హీందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముంబైలో షూటింగ్ పూర్తి చేసుకున్నాక బ్యాంకాక్‌లో తరువాత షెడ్యూల్ ప్లాన్ చేశాడు పూరి జగన్నాథ్ . కరోనావైరస్ వల్ల దాదాపు ఆరునెలలు చిత్రీకరణ సాధ్యం కాలేదు.


తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ త్వరలో మళ్లీ ప్రారంభం కానుందట. దీని కోసం త్వరలో టీమ్ మొత్తం కలిసి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు సిద్ధం అవుతోందట. చార్మీ, కరణ్ జోహర్ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండకు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉండటంతో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్.


ALSO READ | Prabhas Updates: బిగ్ బీ పాత్ర పేరే ప్రభాస్ మూవీ టైటిల్…నాగ్ అశ్విన్ క్లారిటీ


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR