కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన అనంతరం అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో ఆ సినీ కళామ తల్లినే నమ్ముకున్న సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమపై పెద్దచూపుతో షూటింగ్స్‌కి అనుమతించాలని కోరుతూ కొన్ని నెలల కిందట టాలీవుడ్ సినీ పెద్దలు వెళ్లి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ పెద్దల తరపున మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో నాగార్జున,రాజమౌళి, సి కళ్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు, త్రివిక్రమ్, కొరటాల వంటి దర్శకులు, నిర్మాతలతో పాటు ఇంకొందరు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలిసినప్పుడు ( Telangana CM KCR ) రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ( AP CM YS Jagan ) అక్కడి రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సినీ ప్రముఖులు కలిసిన అనంతరం చిరంజీవి-బాలయ్య బాబు మధ్య ఓ వివాదం చెలరేగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో భూములు పంచుకోవడానికి వెళ్లారా అనే వ్యాఖ్యలు సైతం చేశారు. Also read : Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా పోలీస్ లవ్ స్టోరీ


బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నటుడు, మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu comments on Balakrishna ) సైతం అంతే ఘాటుగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ విషయంలో పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయిందా అనేటటువంటి పరిస్థితి, వాతావరణం కనిపించింది. Also read : ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్


ఇది జరిగిన చాలా రోజుల అనంతరం తాజాగా ప్రముఖ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ( Mohan Babu ) ఈ వివాదంపై తనదైన రీతిలో స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు వద్ద ఈ వివాదం గురించి ప్రస్తావించగా.. ఆయన చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. 'బాలయ్య నాకు సోదర సమానుడు, మా అన్న ఎన్టీఆర్ బిడ్డ. తనపై నాకు ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయని చెప్పిన మోహన్ బాబు.. బాలయ్య వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందని అన్నారు. బాలయ్య బాబు-చిరంజీవి మధ్య గొడవపై తాను మాట్లాడదల్చుకోలేదన్న మోహన్ బాబు... ఆ మాటకొస్తే నన్ను కూడా పిలవలేదు' అని చెప్పి మొత్తానికి ఈ విషయంలో ఏ ఒక్కరివైపో వకాల్తా పుచ్చుకుని మాట్లాడకుండా ఆయన తెలివిగా పక్కకు తప్పుకున్నారు. Also read : Bigg Boss Telugu 4: బిగ్ బాస్ 4 షో లాంచింగ్ డేట్ వచ్చేసింది


Also read : ఓటిటిలో విడుదల కానున్న Anchor Sreemukhi సినిమా


Also read : Ananya Panday: ఈ హీరోయిన్‌తో పూరి జగన్నాథ్‌కి కొత్త కష్టాలు


Also read : Acharya controversy: ఆచార్య కథ కాపీనా ? స్పందించిన నిర్మాతలు