అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే వ్యాపారంలో ప్రదాన లక్షణం. దీన్నే పాతకాలం నాటి సామెత దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవడం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ ( OTT Platforms ) వేదికలన్నీ ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్నాయి. కరోనా ( Coronavirus ) తెచ్చిపెట్టిన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్గాలు అణ్వేషిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి. చాలామందిని నాశనం చేసింది. కొందరికి మాత్రం అవకాశాలు పెంచింది. అవును నిజమే. కరోనా వైరస్ కారణంగా కొన్ని వ్యాపారాలు నష్టపోతే..మరికొన్ని వ్యాపారాలు మాత్రం ఊపందుకున్నాయి. ఫార్మాస్యూటికల్, మెడికల్ బిజినెస్ ( Medical Business ) బాగా ఊపందుకుంది. ఇక సినీ పరిశ్రమ ( Movie industry ) దాదాపు క్షీణించుకోపోయింది. అదే సమయంలో ఇదే సినీ పరిశ్రమకు అనుబంధంగా సాగే ఓటీటీ బిజినెస్ ( OTT Business ) మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా విద్యాలయాలు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్ధులంతా ఓటీటీ ఖాతాదార్లుగా మారిపోయారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా పెరిగింది. వర్క్ ఫ్రం హోం కల్చర్ కూడా ఉండటంతో బ్రాండ్ బ్యాండ్ సర్వీసులు భారీ ప్యాకేజీలు ప్రకటిస్తూ వచ్చాయి. ఓవరాల్ గా కోవిడ్ వైరస్ కారణంగా ఓటీటీ బిజినెస్ పెరిగింది. ఇప్పుడిదే అవకాశాన్ని మరింతగా అందిపుచ్చుకోడానికి సరికొత్త మార్గాల్ని అణ్వేషిస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. 


ఇందులో భాగంగా ఇప్పుడు పే పెర్ వ్యూ ( Pay per view ) పద్ధతిని తీసుకురానున్నాయి ఓటీటీ ప్లాట్ పామ్స్. అంటే చూసిందానికి చెల్లించడమన్నమాట. ఇప్పటివరకూ ఏదైనా ప్యాకేజ్ తీసుకుంటే  ఆ ప్యాకేజ్ పూర్తయ్యేంతవరకూ అందులోని కంటెంట్ అంతా చూసే పరిస్థితి ఉండేది. ఇకపై అంటే భవిష్యత్తులో అలా ఉండకపోవచ్చు. ఓటీటీలో పే పెర్ వ్యూ పద్ధతి తీసుకొచ్చేందుకు ఆలోచన సాగుతోంది.  


ఎందుకంటే తమిళ సినిమా రణసింగం, హిందీ సినిమా ఖాలీ పీలి రెండింటినీ పే పర్ వ్యూలోనే రిలీజ్ చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 ( Zee5 ) . రణసింగం సినిమాకు 199 రూపాయలు పెడితే, ఖాలీ పీలికు 299 రూపాయలుగా ధర నిర్ణయించింది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నాక కూడా ఎక్స్‌ట్రా పే  చేయమంటే..ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్న.  


పే పర్ వ్యూ పద్ధతిని కేవలం ప్రేక్షకులతోనే కాకుండా ప్రొడ్యూసర్లతో కూడా డీల్స్ పెట్టుకోనున్నాయి ఓటీటీ సంస్థలు. 50-50 నిష్పత్తి, కనీస గ్యారెంటీ లాంటి కాన్సెప్టులని పట్టుకొస్తున్నాయట. అలాగే సినిమా వ్యూస్‌ని బట్టి డబ్బులు ఇచ్చే ప్రక్రియను అమలు చేద్దామని భావిస్తున్నాయి. ఇలాంటి డీల్స్‌పై చాలామంది నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మీ సినిమాలు మాకివ్వండంటే మాకివ్వమని పోటీ పడిన ఓటీటీ సంస్థలిప్పుడు...అవకాశం అదునుగా చేసుకుని వ్యాపారం చేస్తున్నాయంటూ విమర్శలు  చేసేవాళ్లు లేకపోలేదు. వ్యాపారంలో ఇలాంటివి తప్పవని సమర్ధించేవారూ ఉన్నారు. Also read: Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్ దత్