తెలుగు సినిమాకు ఇది మరో స్వర్ణయుగం. డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) నటించిన బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ హీరోలంతా ప్యాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. తమ కెరియర్ లో చేయని రోల్స్ చేస్తూ, డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారు. తమ ఇమేజ్ కు డ్యామేజ్ కాకుండా, ఫ్యాన్స్ ఫీలింగ్స్ హర్ట్ అవకుండా.. అదే సమయంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు.
ALSO READ|  SP Balasubrahmanyam: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టాప్ 10 తెలుగు సాంగ్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల తమ కెరియర్ గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి వారికి సమయం దొరికింది. ఈ సమయంలో విన్న మంచి కథలలో కొన్నింటికి ఓకే చెప్పి లాక్ డౌన్ తరువాత దూకుడు చూపిస్తున్నారు.


నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింఘ రాయ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ రాధే శ్యామ్, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. జూ. ఎన్టీఆర్ అటు RRR చేస్తూనే త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకున్నాడు. కేజీఎఫ్ దర్శకుడితో కూడా సినిమా టాక్ లో ఉంది. 


రవితేజ, విజయ్ దేవరకొండ చెరో మూడు మూడు సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా వేణు శ్రీరామ్, కొరటాల శివతో మూవీకి అంగీకరించాడు. కానీ రామ్ చరణ్ మాత్రం మరో చిత్రానికి అంగీకరించలేదు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR లో నటిస్తున్నాడు చెర్రీ.



ALSO READ|  Allu Arjun: పుష్ప కోసం పులితో ఫైట్..అల్లు అర్జున్ మెగా రిస్క్


మిగితా హీరోల్లా రామ్ చరణ్ ( Ram Charan ) కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే చెర్రి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఒకసారి ఒక చిత్రం అనే పాలసీ పాటిస్తున్నాడేమో. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR