RRR Fan Make Sketch: బాహుబలి ( Bahubali ) తరువాత రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ చిత్రంలో రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ ( RRR First Look ) ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్‌లుక్ గురించి చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) వల్ల సినిమా షూటింగ్‌లపై కూడా ప్రభావం పడింది. దీంతో RRR ఫస్ట్‌లుక్ విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను తన క్రియేటివిటీతో ఒక డిజిటర్ ఆర్ట్ ( Digital Art ) గీసి షేర్ చేశాడు. చాలా మంది దీనికి RRR ఫస్ట్‌లుక్ ఇదేనంటూ షేర్ చేస్తున్నారు.Also Read : Apsara Rani: ధ్రిల్లర్ మూవీలో సరికొత్త హాట్ స్టిల్స్



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నరేష్ రావులపల్లి ( Naresh Ravulapalli ) అనే డిజిటర్ ఆర్టిస్ట్ ఈ స్కెచ్‌ను గీసి సోషల్ మీడియా (Social Media ) లో షేర్ చేశాడు. ఈ డిజిటల్ ఆర్ట్‌ను తెగ ఇష్టపడుతున్నారు. అయితే నరేష్ రావులపల్లి గతంలో ప్రభాస్ ( Prabhas ) , మహేష్ బాబు ( Mahesh Babu ) , పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) డిజిటల్ స్కెచ్‌లు గీసి షేర్ చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం 2021 విడుదల అవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. రాజమౌళి త్వరలో ఈ విషయం గురించి ఏదైనా షేర్ చేస్తాడని కోరుకుంటున్నారు.


 Also read: Sachin Pilot: సత్యాన్ని ఓడించలేరు