Actress Tamanna Bhatia updates: టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah) ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా ( Coronavirus) నుంచి కోలుకున్నాక ఈ బ్యూటీ.. అనతికాలంలోనే కేరిర్‌పై దృష్టి సారించింది. దానిలో భాగంగా డైలీ వర్కవుట్లు చేసి.. కేవలం మూడు వారాల్లోనే మునుపటి రూపంలోకి వచ్చింది. తాజాగా ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలను చూస్తుంటే.. మునుపటి ఆకారం కోసం ఈ మిల్కీ బ్యూటీ ఎంతలా కష్టపడిందో అనే విషయం అర్థమవుతోంది. అయితే కరోనా నుంచి కోలుకున్నాక ప్రస్తుతం ఆమె మళ్లీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఆహా ఈవెంట్‌లో తమన్నా.. అందాల విందు చేసి అందరినీ ఫిదా చేసింది. హాట్ లుక్‌లో దర్శనమిచ్చి.. అందరూ కళ్లుతిప్పుకోకుండా చేసింది. అయితే ఆహా కోసం తమన్నా `లెవెంత్ అవర్` (web series '11th Hour' ) అనే తెలుగు వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా జరిగిన ఆహా వీడియో లాంచ్ ఈవెంట్‌లో తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాకుండా దీనికి సంబంధిచిన ఫొటోలను మిల్కీ బ్యూటీ ఇన్‌స్టాలో షేర్ చేసి అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవలనే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిర్మాణ సంస్థ తమన్నా ఫస్ట్ లుక్‌ను సైతం విడుదల చేసింది. Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక



Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe