Varudu Kavalenu trailer: నాగ శౌర్య, రితూ వర్మ (Naga Shaurya and Ritu Varma) జంటగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు వరుడు కావలెను ట్రైలర్ విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాళ రాత్రి 7 గంటలకు రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరై ట్రైలర్ లాంచ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి చూపులు కాన్సెప్ట్ (Pelli choopulu) అంటేనే ఇష్టపడని ఓ అమ్మాయి తనకు కావాల్సిన అబ్బాయిని వరుడిని ఎలా ఎంచుకుంది అనేదే వరుడు కావలెన్ మూవీ కాన్సెప్ట్, కథనం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వరుడు కావలెను ట్రైలర్ గురించి చెప్పడం కంటే ముందుగా మీరే ఓ లుక్కేయండి.



Also read : Kota Srinivasa Rao comments on Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబు ఎవరు ? : కోట శ్రీనివాస రావు


భూమి అనే అమ్మాయి పాత్రలో రితూ వర్మ (Actress Ritu Varma), ఫారెన్ నుంచి వచ్చిన ఆకాశ్ అనే అబ్బాయి పాత్రలో నాగ శౌర్యల (Naga Shaurya) పూర్తి పర్‌ఫార్మెన్స్ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందనే అంచనాలు పెంచేలా వరుడు కావలెను ట్రైలర్ కట్ చేశారు. లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న వరుడు కావలెను సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యకు (Director Lakshmi Sowjanya) డైరెక్టర్‌గా తొలి ప్రయత్నమే అయినప్పటికీ.. ఏదో కొత్తదనం చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది.


వరుడు కావలెను సినిమాలో 'దిగు దిగు నాగ' సాంగ్‌ని రీమిక్స్ చేయగా.. (Digu digu naga song remix) ఈ రీమిక్స్‌కి థమన్ తన స్టైల్లో మాస్ బీట్స్ అందించాడు. ఇప్పటికే దిగు దిగు నాగ సాంగ్ పెద్ద హిట్ కాగా.. ఆ సాంగ్ గ్లింప్స్ సైతం వరుడు కావలెను ట్రైలర్‌లో (Varudu Kavalenu trailer) చూపించారు.


Also read : Shah Rukh Khan met Aryan Khan: ముంబై ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఆర్యన్‌ ఖాన్‌ను కలుసుకున్న షారుక్‌


Also read : Sridevi Soda Center: ఓటీటీలో ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ మూవీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook