Varudu Kavalenu trailer: వరుడు కావలెను ట్రైలర్ లాంచ్ చేయనున్న రానా

Varudu Kavalenu trailer launch: వరుడు కావలెను మూవీతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 06:30 AM IST
Varudu Kavalenu trailer: వరుడు కావలెను ట్రైలర్ లాంచ్ చేయనున్న రానా

Varudu Kavalenu trailer launch: రానా దగ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను ట్రైలర్ లాంచ్ కానుంది. రేపు రాత్రి 7 గంటలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నట్టు తాజాగా మూవీ యూనిట్ ప్రకటించింది. నాగ శౌర్య, రితూ వర్మ (Naga Shaurya and Ritu Varma) జంటగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమా ఈ నెల 29న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. అందులో భాగంగానే రేపు గురువారం ట్రైలర్ లాంచింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

వరుడు కావలెను మూవీతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. 'దిగు దిగు నాగ' సాంగ్‌ని (Digu digu naga song remix) మాత్రం థమన్ రీమిక్స్ చేశాడు. 

Also read : Kareena Kapoor in Prabhas Film: ప్రభాస్‌ స్పిరిట్‌ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విలనిజం!

ఛలో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని నాగ శౌర్య ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది నాగ శౌర్య చేతిలో మొత్తం ఆరు సినిమాలు ఉన్నాయి. వరుడు కావలెను (Varudu Kavalenu movie release date), ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, లక్ష్య, నారి నారి నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక చిత్రాలతో పాటు అనిష్ కృష్ణ తెరకెక్కిస్తున్న మరో అన్‌టైటిల్డ్ మూవీ ప్రస్తుతం నాగ శౌర్య ఖాతాలో ఉన్నాయి. 

ఈ వరుస చిత్రాల్లో ముందుగా వస్తున్న సినిమా వరుడు కావలెను సినిమాతోనే (Varudu Kavalenu trailer launch) సక్సెస్ అందుకుని మిగతా చిత్రాలను అదే సక్సెస్ దారిలో నడిపించాలని నాగ శౌర్య (Naga Shaurya) భావిస్తున్నాడు.

Also read : Samantha Defamation Case: కోర్టును ఆశ్రయించిన సమంత..యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!

Also read : Salaar fighting scene leaked: సలార్ ఫైటింగ్ సీన్ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x