Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి.
కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అలా మనం తినే ప్రతీ కూరగాయలు, పండ్లు రసాయనాలతో కలుషితమవుతాయి. అలాగే శుభ్రపరచకుండా కూరగాయలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ ( Coronavirus infections ) వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
Coronavirus మొదలైనప్పటి నుండి, కరోనా బారిన పడకుండా ఉండటం కోసం అన్నివర్గాల ప్రజల్లో పరిశుభ్రతపై కొంత అవగాహన పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కొన్ని విచిత్రమైన ఆలోచనలతో శానిటైజర్‌తో కూరగాయలను శుభ్రం చేయడం లేదా పాల ప్యాకెట్లను డిటర్జెంట్‌తో కడగడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అపోహలకు చెక్ పెట్టడానికి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా అనే సందేహాలను నివృతి చేస్తూ FSSAI ఇచ్చిన ఈ సలహాలు, సూచనలు తెలుసుకుందాం. Also read: మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?
కూరగాయలు, పండ్లను ( Vegetables, fruits ) ట్యాప్ నీటితో బాగా శుభ్రం చేయండి. ఆకు కూరల విషయానికొస్తే, వాటిని ఒక గిన్నెలో నీటిలో పోసి కొన్ని నిమిషాలు నానబెట్టి, మీ చేతితో బాగా కడగండి. పండ్లను తినే ముందు కనీసం రెండుసార్లు అయినా కడగాలి.
కూరగాయలను ఉప్పు నీటిలో వేసి నానబెట్టడం వల్ల క్రిమిసంహారక మందులను తొలగించవచ్చు. నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ( Vinegar ) వేసి, కూరగాయలను సుమారు 3-5 నిమిషాలు నానబెట్టండి. పండ్లు ఎక్కువ సమయం తీసుకుంటాయి కనుక వాటిని 20 నిమిషాలు నానబెట్టండి. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు
ఒక వంతు వెనిగర్, మూడు వంతుల నీటిని కలిపి కూరగాయలు, పండ్లపై పిచికారీ చేయాలి. తరువాత శుభ్రమైన నీటితో కడగాలి.
కూరగాయలు, పండ్లను వేడి నీటిలో ముంచి, తరువాత చల్లటి నీటితో కడగండి. కూరగాయలను 3 నిముషాల కంటే ఎక్కువసేపు నానబెట్టవద్దు. అలా చేయడం వల్ల అవి రుచిని కోల్పోతాయి.
కూరగాయలు, పండ్లు రుచిని కోల్పోకుండా వైరస్ నుంచి శుభ్రం చేయడం కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని చిట్కాలు వెల్లడించింది. Also read: How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే
1. బయట నుండి తీసుకు వచ్చిన పండ్లను, కూరగాయలను ఎవరు ముట్టుకోకుండా అలాగే సంచీలోనే పక్కన ఉంచండి.
2. తరువాత వాటిని తీసి గోరువెచ్చని నీటితో బాగా కడగండి. లేదా గోరువెచ్చని నీటిలో 50 ppm క్లోరిన్‌ని కలిపి కూరగాయలను అందులో ముంచండి.
3. తరువాత వాటిని తీసి మంచి నీటితో శుభ్రంగా కడగండి.
4. పండ్లు, కూరగాయలను సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేయకూడదు. అన్ని సబ్బులలో ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది తీసుకుంటే పొట్టలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
5. ఫ్రిజ్‌లో తప్పనిసరిగా ఉంచవలసిన వాటిని మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. మిగితా వాటిని రూమ్ టెంపరెచర్‌లో బయటనే బాస్కెట్‌లో ఉంచండి.
Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం