Corona New Variant: ఊహించిందే జరుగుతోంది. కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెంది కొత్తరూపం దాల్చింది. కొత్త వేరియంట్‌గా భయపెడుతోంది. వ్యాక్సిన్‌కు సైతం ఈ వేరియంట్ చిక్కదని తేలడంతో ఆందోళన పెరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic)ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వివిధ వేరియంట్లతో వణికిస్తోంది. ఇప్పుడు మరో కొత్తరూపు దాల్చింది. కొత్త వేరియంట్‌గా ప్రపంచానికి సవాలు విసురుతోంది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్ఐఎస్‌పీ సంస్థతో జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ సీ 1.2 బయటపడిందని అంటున్నారు. 2021 మే నెలలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని..ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లలో ఈ వేరియంట్ జాడలు కన్పించాయని చెబుతున్నారు. 


కొత్త వేరియంట్‌లు(Covid New Variant)రావడం సహజమే అయినా ఈ వేరియంట్ కాస్త ప్రత్యేకంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌కు(Corona Vaccine)ఈ వేరియంట్ అందదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. కరోనా వ్యాక్సిన్ కల్పించే రక్షణ వ్యవస్థను దాటుకుని ఈ వేరియంట్ ముందుకు పోతుందని నిపుణుల పరిశోధనలో వెల్లడైంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్ఐసీడీ(NICD) శాస్త్రవేత్తలు తెలిపారు. అటు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ జీనోమ్స్ సంఖ్య పెరుగుతూ వస్తోందని అధ్యయనం తెలిపింది. ఈ వేరియంట్‌లో మ్యూటేషన్ రేటు 41 శాతం ఉందని తెలుస్తోంది. సీ 1.2 వేరియంట్‌లో(Corona C 1.2 Variant) కన్పించే కొత్త రకాల మ్యూటేషన్లు క్లాస్ 3 యాంటీబాడీలను(Antibodies) తప్పించుకోగలదని తేలడం ఆందోళనను పెంచుతోంది. ఈ వేరియంట్‌లో ఎన్ 440 కే, వై 449 హెచ్ మ్యూటేషన్లు ఉన్నట్టు కనుగొన్నారు. 


Also read: Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ డేంజర్ బెల్స్..ఏపీలో విపత్కర పరిస్థితులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook