వాతావరణం మారుతున్నందున ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జలుబు, దగ్గు ( Cough and Cold ) వచ్చే ప్రమాదం ఉంది. పైగా రోగనిరోధక ( Immunity ) శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ మార్పులు ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యకరమైన ( Health )  లైఫ్ స్టైల్ తో ( Lifestyle ) ఎన్నో సమస్యలు రాకుండా నివారించవచ్చు. మీ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. మరి రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందామా.



1. అల్లం ( Ginger )
అల్లంలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగాలతో పారాడేలా చేస్తుంది.


2. గ్రీన్ టీ ( Green Tea )
గొంతునొప్పిని తగ్గించి, దగ్గును తగ్గించడంలో గ్రీన్ టీ ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.


3. పుట్టగొడుగులు ( Mushrooms )
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచడానికి పుట్టగొడుగులు తింటారు.  ప్రతీ రోజు 30 గ్రాముల పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల ఎన్నో శారీరక రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు.




4. పసుపు ( Turmeric )
కొన్ని వందల సంవత్సరాల నుంచి పసుపును ఇన్ఫెక్షన్ల నుంచి పోరాటడానికి వినియోగిస్తున్నారు. పురాతన మెడిసిన్ ప్రకారం ఇందులో కర్ క్యూమిన్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేన్సర్, ఆల్జీమర్స్ ను తగ్గిస్తాయి.


5.  పులుపు పండ్లు ( Sour Fruits )
విటమిన్ సి శారీరక ఎదుగుదలకు, తెల్ల రక్తకణాల పెరుగుదలకు మంచిది. ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్ వంటి పులుపు, నిమ్మజాతి పండ్లను తీసుకోవాలి. 


6. బ్రకోలి ( Broccoli ) 
ఆకుపచ్చ కూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా అధికం. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.




7. పాలకూర ( Spinach ) 
పాలకూరను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి వల్ల శరీరం ఆరోగ్యకరంగా మారుతుంది.


8. బాదాం ( Almonds )
ప్రతీ రోజు 8-9 బాదాంలను తీసుకోవడం వల్ల శరీరానికి రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది. దాంతో పాటు మెడడుపై ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది విషతుల్యాను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. కేన్సర్ సెల్స్ ను తరిమికొడుతుంది.