Bengaluru Riots: సోషల్ మీడియా పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. ఇద్దరు మృతి
ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక (Karnataka) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ (Riots)లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలి వానాల మారింది.
Bengaluru violent clashes: బెంగళూరు: ఓ సోషల్ మీడియా పోస్టుపై కర్ణాటక ( Karnataka ) రాష్ట్ర రాజధాని బెంగళూరు (Bengaluru) లో హింసాత్మక ఘర్షణ ( Riots )లు చెలరేగాయి. ఓ ఎమ్మెల్యే బంధువు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయడంతో ఈ వివాదం కాస్త చినికిచినికి గాలివానాల మారింది. ఈ ఘర్షణలో ఇద్దరు మరణించారని, ఇప్పటివరకు 110మంది అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పులకేషినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి (akhanda srinivas murthy) బంధువు వివాదాస్పద పోస్టు పెట్టడంతో అల్లరిమూకలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో.. అల్లరిమూకను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.
అయితే.. ఈ హింసాత్మక ఘర్షణలు బెంగళూరులోని డిజే హల్లీ, కెజీ హల్లీ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చెలరేగాయని, కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఈ ఘర్షణల్లో అదనపు పోలీసు కమిషనర్‌తో సహా 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారన్నారు. ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్ట్ చేసినందుకు నిందితుడు నవీన్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు నగరంలో 144సెక్షన్‌ను విధించారు. Also read: Prabhas Fees: రెమ్యునరేషన్ విషయంలో ప్రభాస్ ఇండియాలోనే టాప్?
ఇదిలాఉంటే.. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి (Basavaraj Bommai) ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలాఉంటే.. అల్లరిమూక ఎమ్మెల్యే ఇంటితోపాటు పోలీసుస్టేషన్లపై, పోలీసులపై రాళ్లు రువ్వి నిప్పు పెట్టింది. అయితే ఈ ఘర్షణ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిసింది. Thunderstorms: పిడుగు అంటే ఏంటి ? తప్పించుకోవాలంటే ఏం చేయాలి ?