Coronavirus medicine: కరోనిల్ మెడిసిన్‌పై మరో ట్విస్ట్
పతంజలి సీఈవో బాలకృష్ణ ( Patanjali CEO Balakrishna ) మంగళవారం ఈ వివాదంపై మాట్లాడుతూ.. తమ మందు కరోనా నివారణకు పనిచేస్తుందని, తాము ఎప్పుడూ చెప్పలేదని, వాణిజ్య పరంగా విక్రయించలేదంటూ వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
Coronavirus medicine: హరిద్వార్: కరోనావైరస్ నివారణకు ‘కరోనిల్’ (Coronil) ఔషధం రూపొందించినట్లు జూన్ 23న పతంజలి సంస్థ ప్రకటించిన నాటి నుంచి రోజురోజుకు సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR) ఆదేశాలను పతంజలి సంస్థ బేఖాతరు చేసినట్లు దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో పతంజలి సీఈవో బాలకృష్ణ మంగళవారం ఈ వివాదంపై మాట్లాడుతూ.. తమ మందు కరోనా నివారణకు పనిచేస్తుందని, తాము ఎప్పుడూ చెప్పలేదని, వాణిజ్య పరంగా విక్రయించలేదంటూ వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ( Also read: Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’ )
పతంజలి సంస్థ అధిపతి, ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ( Ramdev Baba ) పతంజలి సీఈఓ బాలకృష్ణతో కలిసి బుధవారం హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనిల్ ఔషధం అమ్మకానికి తమ దగ్గర ఆయుర్వేద డ్రగ్ లైసెన్స్ (Ayurvedic Drug Licence ) ఉందని వెల్లడించడంతో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాము తయారుచేసిన కరోనా కిట్‌లోని ' దివ్య స్వసరి వతి, దివ్య కరోనిల్ టాబ్లెట్, దివ్య అను తైల్’ ఔషధాలను దేశవ్యాప్తంగా విక్రయించడానికి అనుమతి లభించిందని, దీనికి సబంధించిన క్లినికల్ ట్రయల్ పత్రాలను కూడా ఆయుష్ శాఖ, ప్రభుత్వానికి అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ( Also read : Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ? )
ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ.. తనపై కావాలనే దుష్ఫ్రచారం చేస్తున్నారని, కరోనిల్‌ను చట్టం ప్రకారమే తయారుచేశామని తెలిపారు. పరిశోధనకు సంబంధించిన సాక్ష్యాలను ముందే ఆయూష్ మంత్రిత్వ శాఖకు సమర్పించామని, తమ ప్రయత్నాలను ఆ శాఖ కూడా ప్రశంసించిందన్నారు. దీనిపై ఇప్పుడేం వివాదం లేదన్నారు. తాము జరిపిన పరిశోధనలో 7 రోజుల్లో 100 శాతం మంది కోలుకున్నారని, తమ దగ్గర 500 మంది శాస్త్రవేత్తల బృందం ఉందని పేర్కొన్నారు. తమ పరిశోధనలో కరోనావైరస్ ఉపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తేలిందన్నారు. ఇంకా పది వ్యాధులపై కూడా క్లినికల్ ట్రయల్ నిర్వహించినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అందుబాటులోకి..
తమకు ఆయుర్వేద డ్రగ్ లైసెన్స్ లభించిందని, దేశవ్యాప్తంగా కరోనిల్ మందు అందుబాటులో వస్తుందని బాబా రాందేవ్ పేర్కొన్నారు. నియమ నిబంధనల ప్రకారమే పరిశోధనతోపాటు ట్రయల్ కూడా నిర్వహించామన్నారు. పతంజలి సీఈవో కరోనాకు మందు కనుగొనలేదని పేర్కొన్న కొన్ని గంటల్లోనే బాబా రాందేవ్ ఈ ప్రకటన చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..