Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’

కరోనాకు పతంజలి సంస్థ మెడిసిన్ ‘కరోనిల్ కిట్’ కనుగొన్నట్లు చెప్పిన యాజమాన్యం అంతలోనే యూటర్న్ తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ ఆదేశాలను తుంగలోతొక్కడంతో దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పతంజలి సంస్థ మంగళవారం కరోనిల్ కిట్ మెడిసిన్‌పై క్లారిటీ ఇచ్చింది.

Last Updated : Jun 30, 2020, 04:15 PM IST
Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’

కరోనా వైరస్‌ ( Coronavirus medicine) కు పతంజలి సంస్థ మెడిసిన్ ‘కరోనిల్ కిట్’ (Coronil Kit) కనుగొన్నట్లు చెప్పిన యాజమాన్యం అంతలోనే యూటర్న్ తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR) ఆదేశాలను తుంగలోతొక్కడంతో దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పతంజలి సంస్థ మంగళవారం కరోనిల్ కిట్ మెడిసిన్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఔషధ విభాగానికి రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొంది. పతంజలి సంస్థ కరోనా వైరస్‌కు ఔషధం కనుగొన్నట్లు ఎప్పుడూ చెప్పలేదని మంగళవారం ఉత్తరఖండ్ ఔషధ శాఖ (Uttarakhand Drugs Control) కు వివరణ ఇచ్చింది. కరోనా కిట్ పేరుతో తాము ఎలాంటి ఆయుర్వేద ఉత్పత్తిని తయారుచేయలేదని తమపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. మోదీజీ Paytm బ్యాన్ చేసి 56 అంగుళాల ఛాతీ చూపించండి: కాంగ్రెస్ ఎంపీ

ఏ ప్రచారం చేయలేదు..
తాము కరోనా కిట్ అనే ఔషధాన్నే తయారు చేయలేదని, కిట్‌లో  "దివ్య స్వసరి వతి",  "దివ్య కొరోనిల్ టాబ్లెట్", "దివ్య అను తైల్" అనే ఔషధాలను మాత్రమే ప్యాక్ చేశామని తెలిపింది. ఇంకా తాము "కరోనిల్ కిట్" పేరుతో  ఏ కిట్‌ను వాణిజ్యపరంగా విక్రయించలేదని,  కరోనా చికిత్స కోసం ఏ ప్రచారం చేయలేదని స్పష్టంచేసిది. తాము ఆ ఔషధానికి సంబంధించిన ఫలితాలను మీడియా ముందు వెల్లడించామని స్పష్టం చేసింది. ఈ ఔషధంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని, దానివల్ల కలిగే ప్రయోజనాలను మాత్రమే వెల్లండించామని, ఇది కరోనా వ్యాధిని నయంచేస్తుందని చెప్పలేదని పతంజలి సంస్థ పేర్కొంది. పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ?

వారంలోనే సీన్ రివర్స్...
కాగా.. జూన్ 23న పతంజలి ఆయుర్వేద సంస్థ 'కరోలిన్ టాబ్లెట్'ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కరోనా వైరస్‌ను నయం చేసే ఔషధమూలికలు ఉన్నాయని తెలిపింది. 280 మంది రోగులపై  దీనిని పరీక్షించామని ఆతర్వాత వారందరూ వ్యాధి నుంచి కోలుకున్నారని పతంజలి సంస్థ గత మంగళవారం వెల్లడించింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News