Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత
కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
MP Ashok Gasti dies of COVID-19: బెంగళూరు: కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల అశోక్ గస్తీ (MP Ashok Gasti) అనారోగ్యానికి గురికాగా.. ఆయన కరోనా పరీక్షలు చేయించున్నారు. ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో... సెప్టెంబరు 2న కర్ణాటక (Karnataka) బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శ్వాసకోశ సమస్యలతో అశోక్ గస్తీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం అర్థరాత్రి కన్నుమూసినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. Also read: Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక నుంచి రాజ్యసభకు అశోక్ గస్తీ మొట్ట మొదటిసారి ఎన్నికయ్యారు. జూలై 22న ఆయన రాజ్యసభ సభ్యుడిగా అశోక్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ఒక్కసారి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. కర్ణాటక రాయచూర్‌కు చెందిన అశోక్ గస్తీ విద్యార్థి నాయకుడిగా.. ఆ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. అయితే అశోక్ గస్తీ మరణం పట్ల ఎంపీలు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. Also read: Sputnik-V vaccine : ఆర్‌డీఐఎఫ్‌తో డా. రెడ్డీస్ ఒప్పందం.. భారత్‌లో ‘స్పూత్నిక్ వీ’ ట్రయల్స్