కాంగ్రెస్ దిగ్గజం, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడైన అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ( 71 ) ( Ahmed patel ) కరోనా వైరస్ ( Coronavirus ) తో బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. అహ్మద్ పటేల్ ఇక లేరనే వార్త కాంగ్రెస్ పార్టీ ( Congress party )ని శోకసముద్రంలో ముంచేసింది. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, ట్రబుల్ షూటర్ గా పేరున్న అహ్మద్ పటేల్ మరణించడం పార్టీకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కరోనా కారణంగా శరీరంలోని అవయవాలు పాడవడంతో అహ్మద్ పటేల్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 


అహ్మద్ పటేల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ( pm narendra modi ), ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సహా కాంగ్రెస్ ప్రముఖులు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీలు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా తమ సంతాపం ప్రకటించారు. అహ్మద్ పటేల్ లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. 


అహ్మద్ పటేల్ ఎక్కువకాలం ప్రజాజీవితంలో ఉన్నారని..ఆయన మరణం బాధాకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కుమారుడు ఫైసల్ తో మాట్లాడానన్నారు.



 


అహ్మద్ పటేల్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకు పిల్లర్ అని..జీవించింది..శ్వాస తీసుకుంది పార్టీతోనే నని చెప్పారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.



అటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సైతం ట్వీట్ ద్వారా తన విచారం వ్యక్తం చేశారు. పార్టీకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.