ఆర్బీఐ ఉద్యోగుల ఔదార్యం.. కోట్ల రూపాయల కరోనా విరాళం
దేశంలో బ్యాంకులకే రారాజు భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఉద్యోగులు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఆర్బీఐ ఉద్యోగులు కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 30వేలకు చేరుకుంది. దాదాపుగా 950 మంది ప్రాణాంతక మహమ్మారి సోకి చనిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేసేందుకు వ్యాపారులు, సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని ప్రధాని సహాయనిధికి, సీఎంల రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నారు. చిరంజీవి పాటకు మనవరాలి ‘మెగా’ జోరు.. వైరల్ వీడియో!
ఈ నేపథ్యంలో దేశంలో బ్యాంకులకే రారాజు భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ఉద్యోగులు తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఆర్బీఐ ఉద్యోగులు కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అందులో భాగంగా ఒకరోజు లేక అంతకంటే ఎక్కవ జీతాన్ని ప్రధాని కరోనా సహాయనిధికి అందజేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మొత్తంగా రూ.7.30 కోట్ల నగదును పీఎం కేర్స్ ఫండ్‌కు జత చేయనున్నట్లు తెలిపిందని జాతీయ మీడియా ఏఎన్ఐ పేర్కొంది. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
దేశం కోసం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆర్బీఐ ఉద్యోగుల చర్య అభినందనీయం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో కోత విధించి ఆ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి, ఇతరత్రా వైద్య సదుపాయాలకు సమకూర్చనున్నవిషయం తెలిసిందే. కరోనా 6 కొత్త లక్షణాలు..మీకు తెలుసా!
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల జీతాల్లో కరోనా చర్యలు, సేవల నిమిత్తం కోత విధించడంతో పాటు సహాయనిధికి తమ వంతుగా చిన్న సాయాన్ని చేసినా ప్రమోజనం ఉంటుందని పిలుపునిస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos