నిత్యం సినిమాలతో బిజిబిజీగా గడిపే నటీనటులు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. కొందరు పిల్లలతో, మరికొందరు మనవడు, మనవరాళ్లతో ముచ్చట్లు చెబుతూ లాక్‌డౌన్‌ను టైమ్ పాస్ చేస్తున్నారు. రావడం కాస్త ఆలస్యమైందేమో కానీ.. రావడం పక్కా అంటూ ట్విట్టర్‌లోకి నెల రోజుల కిందట ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్‌ప్రైజ్
కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తుండగా లాక్‌డౌన్ వచ్చింది. దీంతో తన మనవరాలితో కాలక్షేపం చేస్తున్న వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిన్న మనవరాలు ఆయన నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలోని మిమ్మీ.. మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ.. పాటను తెగ ఎంజాయ్ చేస్తోందని, స్టెప్పులు కూడా వేస్తుందని ట్వీట్ చేశారు చిరు. పదే పదే ఆ పాట వద్దని చెబుతున్నా మనవరాలు వినిపించుకోవడం లేదు మరి. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే😄 #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020
కేవలం ఏడాది వయసున్న శ్రీజ చిన్న కుమార్తె నవిష్క ఈ పాటను పదే పదే వింటూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తుంది. పాట వింటూ స్టెప్పులు వేయాలని ట్రై చేస్తోంది. పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిడ్ నాకే అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేసిన ఆ వీడియో పోస్ట్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ ముగియగానే వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో మళ్లీ చిరు బిజీ కానున్నారు. సో ఇదే చాన్స్ అని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!