BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ( Former president Pranab Mukherjee ) ఇక లేరు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ( Former president Pranab Mukherjee ) ఇకలేరు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండే రిఫరెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించిననట్టు ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ( Pranab Mukherjee's son Abhijit Mukherjee ) ట్విటర్ ద్వారా సమాచారం అందించారు. ప్రణబ్ ముఖర్జీ గత కొంత కాలంగా కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలో ఉన్న ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
Viral Video: ఈ వీడియోలో చిరుత ఎక్కడుందో కనుక్కోగలరా ? ట్రై చేయండి
-
N-95 Mask: ఎన్ 95 మాస్కును ఎలక్ట్రిక్ కుక్కర్ లో ఇలా క్లీన్ చేయోచ్చు
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఆర్ ఆర్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనావైరస్ ( Coronavirus ) పాజిటీవ్ ఉన్నట్టు కూడా తేలింది. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.