Railway Penalty Rules: మీరు రైలు ప్రయాణం చేయబోతున్నారా? అయితే, మీకు ఈ రూల్స్‌ తెలుసా? భారత దేశవ్యాప్తంగా నిత్యం ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తారు. మీరు కూడా ట్రైన్‌ జర్నీ చేయబోతున్నట్లయితే ఈ రూల్స్‌ తెలుసుకోండి. లేకపోతే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. రైలు ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులకు ఇండియన్‌ రైల్వే కీలక సూచన చేసింది. అదేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిక్కెట్‌..
సాధారణంగా మనం ట్రైన్‌ జర్నీ చేయాలంటే రైల్వే స్టేషన్‌ లేదా ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటాం. ఆ తర్వాతే రైలు ప్రయాణం చేస్తాం. అయితే, ఇండియన్ రైల్వే రూల్స్‌ ప్రకారం ఒకవేళ మీరు పొరపాటున ట్రైన్‌ టిక్కెట్‌ లేకుండా రైలు ప్రయాణం చేస్తే మీకు రూ. 250 నుంచి రూ. 1000 వరకు జరిమానా విధిస్తారు. లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. 


కోచ్‌..
ఒక కోచ్‌లో టిక్కెట్‌ తీసుకుని మరో కోచ్‌లో ప్రయాణం చేస్తున్నారా? ఆ ట్రైన్‌ టిక్కెట్లకు మధ్య ఎంత డబ్బు తేడా ఉంది వసూలు చేయడంతోపాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఒకవేళ మీరు స్లీపర్‌ ట్రైన్‌ టిక్కెట్‌ తీసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు.


మందు..
ఒక వేళ రైలు ప్రయాణం చేసే ముందు మద్యం తీసుకుని రైలు ప్రయాణం చేస్తే కూడా జరిమానా విధిస్తారు. దీనికి రూ. 500 వరకు జరిమానా విధించి తక్షణమే రైలు నుంచి దింపెస్తారు. అంతేకాదు కొన్ని పరిస్థితుల్లో ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ట్రైన్‌ జర్నీ చేసే సమయంలో మద్యం, స్మోకింగ్‌ రెండూ విరుద్దం.


ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ లు బుక్ చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..


ఐడెంటీ కార్డు..
ఒక వేళ మీరు ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుని దానికి తగిన ఐడెంటీ కార్డు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో లేకపోతే కూడా జరిమానా విధిస్తారు. అందుకే మీ వద్ద ఆధార్ కార్డు వంటి సరైన గుర్తింపు కార్డులను మీతోపాటు పెట్టుకుని ట్రైన్‌ జర్నీ చేయాలి.


చైన్‌ లాగారో..
ఏ అవసరం లేకున్నా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు చైన్‌ లాగినా భారీ జరిమానా విధిస్తారు. సరైన కారణం లేకుండా ఇలా చేస్తే ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధిస్తారు.


ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ సీఎం సాబ్.. సంచలనంగా మారిన ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం..


స్మోకింగ్‌..
మనందరికీ తెలిసిన విషయమే స్మోకింగ్‌ రైలులో చేయకూడదు. ఒక వేళ ఈ నిబంధననను అతిక్రమిస్తే రూ.200 జరిమానా కూడా విధిస్తారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook