Madhya Pradesh cabinet revokes 52 years old rule: సాధారణంగా ప్రజల ఓట్ల ద్వారా ఎంపికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కొన్ని ప్రత్యేకమైన వసతులు, సదుపాయాలను కల్గి ఉంటారు. కానీ కొందరు ప్రజా ప్రతినిధులు గెలిచే వరకు ప్రజల్లో ఉంటారు. కానీ ఒక్కసారి గెలిస్తే మాత్రం.. ఎక్కడి నుంచి వచ్చామన్న విషయం పూర్తిగా మరిచిపోతారు. ప్రజలు ఎన్నుకున్నారన్న ఇంగితం కూడా మర్చిపోయి.. అధికారం, హోదాల మధ్య ఉంటారు. వీరిని ప్రజలు కలసి తమ బాధలు చెప్పుకుందామన్న కనీసం అవకాశం కూడా ఇవ్వరు. కానీ కొందరు నాయకులు మాత్రం వీరికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఎంత ఉన్నత పదవులలో వెళ్లిన కూడా ప్రజలను అస్సలు మర్చిపోరు.నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి బాగోగులు, కష్టాసుఖాల్లో భాగమౌతుంటారు.
Read more: Snake bite: రోజుకు ఒకర్ని కాటేసి చంపేస్తున్న పాము..?.. రెండు దశాబ్దాల తర్వాత మరల హడల్..
ఈ నేపథ్యంలో ఇటీవల పౌరులు, ప్రభుత్వ అధికారుల మధ్య సమానత్వాన్ని నెలకొల్పే విధంగా అనేక రాష్ట్రాలు కొన్నిమార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా .. మధ్య ప్రదేశ్ లో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఈరోజు వార్తలలో నిలిచింది. ఇక మీదట మంత్రులు తమ ఇన్ కమ్ ట్యాక్స్ లను వాళ్లే భరించాలంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో.. మంత్రుల జీతాలు, వారికి ఇచ్చే ప్రోత్సాహకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లిస్తువస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా.. 1972 నిబంధన కూడా ఉంది. అయితే.. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు.
మంత్రి వర్గం ఆమోదంతో.. ఈ నిబంధనను కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే.. 'వీఐపి సంస్కృతి'కి స్వస్తి పలికే ప్రయత్నంలో అసోం ప్రభుత్వం మంత్రులు, ప్రభుత్వ అధికారులు తమ విద్యుత్ వినియోగానికి చెల్లించాల్సి ఉంటుందని సీఎం హేమంత్ బిశ్వశర్మ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
అంతేకాకుండా.. అస్సాం ముఖ్యమంత్రి ఇంధన పొదుపు పట్ల రాష్ట్ర నిబద్ధతను నొక్కిచెప్పారు. రాత్రి 8 గంటల తర్వాత ముఖ్యమంత్రి సచివాలయం, హోమ్.. ఆర్థిక శాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విద్యుత్ అటోమెటిక్ గా డిస్‌కనెక్ట్ చేసే టెక్నికల్ విధానం ప్రారంభించామని వివరించారు.ఈ నేపథ్యంలో తాజాగా, మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్..మంత్రుల జీతాలు, అలవెన్సులపై ఆదాయపు పన్నులను వారే చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం పట్ల దేశంలో ప్రజలు ఇద్దరు సీఎంలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి