CoronaVirus Cases In India: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం క్రమేపీ తగ్గుతుంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. తాజాగా 54 రోజుల కనిష్టానికి ఓ రోజు వ్యవధిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 మరణాలు సైతం నెలరోజుల తరువాత 3 వేల కన్నా తక్కువగా సంభవించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,25,374 (19.25 లక్షలు) శాంపిల్స్ పరీక్షించగా తాజాగా 1,27,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 54 రోజుల తరువాత ఓరోజు వ్యవధిలో నమోదైన అతి తక్కువ కరోనా కేసులు ఇవే. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా (CoronaVirus Cases) సోకిన వారి సంఖ్య 2,81,75,044 (2 కోట్ల 81 లక్షల 75 వేల 044)కు చేరుకుంది. మరోవైపు ఆదివారంతో పోల్చితే సోమవారం శాంపిల్స్ ఎక్కువగా పరీక్షించారు. కోవిడ్19త బారిన పడి మరో 2,795 మంది చనిపోయారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా సోకడంతో మరణించిన వారి సంఖ్య 3,31,895కి చేరుకుంది.


Also Read: Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి



గడిచిన 24 గంటల్లో 2,55,287 (2 లక్షల 55 వేల 287) మంది కరోనాను జయించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,59,47,629 (2 కోట్ల 59 లక్షల 47 వేల 629)కు చేరుకుంది. కరోనా (Covid-19) వైరస్ వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి నేటి వరకూ 34,67,92,257 (34 కోట్ల 67 లక్షల 92 వేల 257) శాంపిల్స్‌కు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.


Also Read: Bank Timings In Telangana: లాక్‌డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే


భారత్‌లో ఇప్పటివరకూ 21,60,46,638 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. యాక్టివ్ కేసులు 20 లక్షలకు దిగువకు చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 18 లక్షల 95 వేల 520 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 92.09 శాతానికి చేరగా, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 6.62 శాతానికి దిగొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.


Also Read: Black Fungus Target: బ్లాక్ ఫంగస్ ఎవర్ని..ఏ వయస్సువారిని టార్గెట్ చేస్తుందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook