భారతీయ రైల్వే (Indian Railway New Record)  సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి మరీ నడిపింది. హ్యాట్సాఫ్ అన్పించింది. ఇది రైలు కాదు మరి..సూపర్ అనకొండనే( Super Anaconda formation ).

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సౌత్ ఈస్ట్ రైల్వే ( South East Railway ) ( SECR ) చేపట్టిన సరికొత్త ప్రయోగం భారతీయ రైల్వే సామర్ధ్యానికి మచ్చుతునకగా నిలిచింది.  15 వందల టన్నులతో కూడిన మూడు రైళ్లను ఒకదానికొకటి అనుసంధానించి  విజయవంతంగా నడిపించింది. ఈ మూడు రైళ్లు కలిపి నడుస్తున్నప్పుడు రైలులా అన్పించలేదు. ఓ సూపర్ అనకొండ వెళ్తున్నట్టుగా కన్పించింది. Also read: IRCTC Tatkal : రైల్వే యాత్రికులకు గుడ్ న్యూస్…ఆ ట్రైన్‌లకు తత్కాల్ బుకింగ్ షురూ


 


బిలాస్ పూర్ ( Bilaspur ) నుంచి చక్రధర్ పూర్ ( Chakradharpur )  డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది. ఈ తరహా ప్రయోగం  ప్రపంచంలోనే తొలిసారిగా తెలుస్తోంది. భారతీయ రైల్వే శక్తి సామర్ధ్యాల్ని చూపించేందుకు ఇదొక ఉదాహరణగా నిలిచింది. మొత్తం 177 వేగన్లతో కూడిన మూడు గూడ్స్ రైళ్లను...ఒక్కొక్కటి 6 వేల హెచ్ పీ సామర్ధ్యం కలిగిన ఇంజన్లతో నడిపింది సౌత్ ఈస్ట్ రైల్వే. ఒక్కసారిగా 177 వేగన్ల ఒకే రైలు వెళ్తుంటే...సూపర్ అనకొండ వెళ్తున్నట్టుగా కన్పించింది.  దీనికి సంబంధించిన  వీడియోను భారతీయ రైల్వే ట్విట్టర్ అక్కౌంట్ లో కూడా షేర్ చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ గూడ్స్ ను రవాణా చేసేందుకే ఈ సూపర్ అనకొండ ఫార్మేషన్ చేపట్టామని ఇండియన్ రైల్వే తెలిపింది. Also read: Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం


ఇంతకంటే ముందు జూన్ 12 వతేదీన తొలి డబుల్ స్టాక్ కంటెయినర్ ( First double stack container train ) రైలును ఓవర్ హెడ్ ఎక్విప్ మెంట్ ఎలక్ట్రిఫైడ్ ( Over head equipment Electrified ) సెక్షన్ల మీదుగా నడిపి మరో రికార్డు సాధించింది. Also read: Amazon Bonus: అమెజాన్ ఉద్యోగులకు భారీ బోనస్