Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం

కరోనా వైరస్ మనిషిని ( Corona virus fear )  ఎంతగా  భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( metro journey ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ..

Last Updated : Jun 29, 2020, 07:39 PM IST
Metro rail: మెట్రోరైలును అప్పుడే వద్దంటున్న జనం

కరోనా వైరస్  మనిషిని ( Corona fear )  ఎంతగా  భయపెట్టాలో అంతగా భయపెట్టేసింది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ ( covid 19 spread ) నేపధ్యంలో ఏది అవసరం..ఏది కాదనేది ప్రజలు పూర్తిగా గ్రహిస్తున్నారా లేదా అంటే...లోకల్ సర్కిల్స్ ( LocalCircles survey ) సర్వే ప్రకారం అవుననే అన్పిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రజలు మెట్రోరైలుకు ససేమిరా ( Metro railjourney ) అంటున్నారు...పూర్తి వివరాలు ఇవీ.. 

కరోనా లాక్ డౌన్ ల ( lockdown ) కాలం ముగిసింది. ఇప్పుడు అన్ లాక్ ( unlock 1 )  ల కాలం నడుస్తోంది. నెమ్మది నెమ్మదిగా జీవితాన్ని తిరిగి గాడిలో తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని తెర్చుకుంటున్నాయి. అయితే మార్చ్ నుంచి నిలిచిపోయిన మెట్రో, లోకల్ రైళ్లు ( metro-local services ) మాత్రం ఇప్పట్లో తెర్చుకునేలా లేవు. వివిధ ప్రాంతాల్లో LocalCircles జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 

Also read : 99 ఏళ్ల వయస్సులో కరోనా నుంచి కోలుకున్న బామ్మ

అన్‌లాక్ 2లో ఎలాంటి సౌకర్యాల్ని ప్రజలు ఆశిస్తున్నారు ? ఏవి అవసరం లేదనుకుంటున్నారనే అంశాలపై దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో సర్వే( survey in 241 districts )  జరిగింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు జనం వెలుగుచూశాయి. ముఖ్యంగా మెట్రో రైళ్లు, లోకల్ రైళ్లను ఒకవేళ అన్ లాక్ 2లో ( unlock 2 )  ప్రారంభించినా సరే...ప్రయాణం చేయమని ఏకంగా 67 శాతం మంది తేల్చి చెప్పారు. జిమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్ ( Gyms & Swimming pool ) కు కూడా కేవలం 15 శాత మంది మాత్రమే ఆసక్తి చూపించారు. రానున్న 3 నెలల వరకూ విహారయాత్రలు, , హూటల్ స్టేకు  కూడా నో చెబుతున్నారు. వీటికైతే ఏకంగా 93 శాతం నో చెప్పారు. రేపటితో అంటే జూన్ 30తో అన్ లాక్ 1 ముగియనున్న నేపధ్యంలో ఈ సర్వే ( survey on metro journey )  ప్రాధాన్యత సంతరించుకుంది. 

దేశవ్యాప్తంగా 241 జిల్లాల్లో జరిపిన  ఈ సర్వేలో 24 వేల మంది నుంచి సమాధానాలు వచ్చాయి. వీలైనంత  మెట్రో రైళ్లను పునరుద్ధరిస్తామని ఢిల్లీ మెట్రో ( Delhi metro corporation )  ప్రకటించడం, అటు జూన్ 15 నుంచి ముంబాయిలో లోకల్ రైళ్లు ( Mumbai local trains ) ప్రారంభమైనా సరే ప్రయాణీకుల్నించి స్పందన లేకపోవడంతో ఈ సర్వేకు ప్రాముఖ్యత ఏర్పడింది. 

Also read : దిల్లీలో మరో రెండ్రోజుల్లో ప్లాస్మా బ్యాంకు

రానున్న నెల రోజుల వ్యవధిలో మెట్రో, లోకల్ రైళ్లను ఉపయోగించుకుంటామని కేవలం 25 శాతమే సంసిద్ధత వ్యక్తం చేశారు. పెట్రో ధరలు , క్యాబ్ ల ధరలు విపరీతంగా పెరిగినా సరే కరోనా భయం ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే అధిక శాతం ప్రజలు మెట్రో ప్రయాణానికి ఇంకా నో అంటున్నారు. 

లోకల్ సర్కిల్స్ ( LocalCircles ) అనేది ఓ సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్. గతంలో ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute)  నేపద్యంలో చైనీ వస్తువుల్ని బహిష్కరించాలా వద్దా అనే అంశంపై ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో  87 శాతం ప్రజలు బాయ్ కాట్ చేస్తామని స్పందించారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x