Amazon Bonus: అమెజాన్ ఉద్యోగులకు భారీ బోనస్

కరోనా సంక్షోభ సమయంలో అమెజాన్ సంస్థ తన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కష్టకాలంలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 3 వేల 775 కోట్ల భారీ భోనస్ ప్రకటించింది.

Last Updated : Jun 30, 2020, 08:17 PM IST
Amazon Bonus: అమెజాన్ ఉద్యోగులకు భారీ బోనస్

కరోనా సంక్షోభ సమయంలో అమెజాన్ సంస్థ తన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కష్టకాలంలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 3 వేల 775 కోట్ల భారీ బోనస్ ప్రకటించింది. 

కరోనా వైరస్ సంక్రమణ, లాక్ డౌన్ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం తలెత్తింది. అన్ని దేశాల్లోనూ ఉద్యోగాలు, వేతనాల్లో కోత విధించాయి చాలా సంస్థలు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రముఖ ఈ మార్కెటింగ్ దిగ్గజమైన అమెజాన్ మాత్రం తన ఉద్యోగులకు భారీగా కరోనా బోనస్ ప్రకటించింది. అది కూడా 3 వేల 775 కోట్ల రూపాయలతో అతిపెద్ద ప్యాకేజ్ కేటాయించింది. జూన్ వరకూ పనిచేసిన సంస్ధ ఉద్యోగులు, భాగస్వాములు ఒక్కొక్కరికీ 150 నుంచి 3 వేల డాలర్లు అంటే….11 వేల 3 వందల రూపాయల్నించి 2 లక్షల 26 వేల వరకూ ఈ బోనస్ అందుతుంది. Also read: Amazon అమెజాన్ ఉద్యోగుల సమ్మెకు కారణం అదేనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో అమెజాన్ సంస్థ ఉద్యోగుల  భద్రత కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనే విషయంపై అమెరికా దృష్టి సారించింది కూడా. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ల వినియోగం, ఉద్యోగుల తనిఖీలు చేస్తుందా లేదా అనేది ఇందులో ప్రధానంగా ఉన్నాయి. మరోవైపు జర్మనీలోని అమెజాన్ సంస్థ ఉద్యోగులు కరోనా నేపధ్యంలోనే సంస్థ పట్టించుకోవడం లేదంటూ 48 గంటల సమ్మెకు కూడా దిగారు. ఈ పరిస్థితుల్లో కరోనా కష్టసమయంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇంత పెద్ద భారీ మొత్తంలో బోనస్ ప్రకటించడం నిజంగానే మంచి విషయం. Also read: ఢాకాలో పడవ ప్రమాదం..మృతుల సంఖ్య 32 పైనే

ఇటీవల ఫేస్ బుక్ సంస్థ సైతం కరోనా సంక్షోభ సమయంలో సహాయంగా 45 వేలమంది ఉద్యోగులకు 6 నెలల బోనస్ ను అందించింది. ఇప్పుడా సరసన అమెజాన్ చేరింది.

Trending News