BJP Manifesto For Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మొదటి దశ పోలింగ్‌కు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గుజరాత్ ప్రజలకు ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గాంధీనగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు వీడియోను రిలీజ్ చేశారు. అంతకుముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ రాజ్యాంగ ప్రతిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. రాజ్యాంగానికి సంబంధించి మనం అంకితభావం ఉన్నవాళ్లమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పాలనలో గుజరాత్ నిరంతరం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీ మాత్రమే చేయగలదని, వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 



బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలుః


  • గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన

  • రాష్ట్రంలో బాలికలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీ 

  • గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి రూ.10,000 కోట్లు కేటాయింపు. 

  • నీటిపారుదల నెట్‌వర్క్‌ కోసం 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు 

  • ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ప్రతి కుటుంబానికి ఉచిత చికిత్స కోసం అందుతున్న మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

  • దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలో రెండు సీఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. 

  • వచ్చే 5 సంవత్సరాలలో గుజరాత్‌లోని లక్ష మంది మహిళలకు ఉపాధి 

  • ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్ల అదనపు బడ్జెట్‌తో గౌశాలను బలోపేతం 

  • అదనంగా 1,000 సంచార పశువైద్య యూనిట్లు ఏర్పాటు 

  • భారతదేశపు మొట్టమొదటి బ్లూ ఎకానమీ ఇండస్ట్రియల్ కారిడార్‌ను నిర్మాణం

  • ఫిషింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం 

  • ష్రామిక్ క్రెడిట్ కార్డ్, రూ.2 లక్షల వరకు రుణం


మేనిఫెస్టోను రూపొందించడానికి గుజరాత్‌లోని కోటి మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు. ఇందుకోసం ఒక వాట్సాప్ నంబర్‌ ద్వారా గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు తదితరుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఆ తర్వాతే అధిష్టానం మేనిఫెస్టోను సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. 


కాంగ్రెస్ మేనిఫెస్టో


గుజరాత్‌లో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండు వారాల క్రితమే ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసింది. గుజరాత్‌లోని ప్రతి పౌరుడికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు 10 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను హామీ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా మారుస్తామని ప్రకటించింది. ఇది కాకుండా గుజరాత్‌లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. స్కూల్ ఫీజులను 25 శాతం తగ్గించి, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.


Also Read: Tirupati: అగ్గిపెట్టే కోసం ప్రాణం తీశాడు.. వీడిన హత్య కేసు మిస్టరీ  


Also Read: Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook