Tirupati: అగ్గిపెట్టే కోసం ప్రాణం తీశాడు.. వీడిన హత్య కేసు మిస్టరీ

Tirupati Old Man Murder Case: అగ్గిపెట్టే అడిగితే తనను తిట్టాడని కోపం పెంచుకున్నాడు. అతను నిద్రలోకి జారుకోగానే దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 02:48 PM IST
  • తిరుపతిలో వృద్ధుడు దారుణ హత్య
  • అగ్గిపెట్టే కోసం హత్య చేసినట్లు గుర్తింపు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Tirupati: అగ్గిపెట్టే కోసం ప్రాణం తీశాడు.. వీడిన హత్య కేసు మిస్టరీ

Tirupati Old Man Murder Case: అది అర్ధరాత్రి సమయం. అతను బీడీ తాగుదామని జేబులో నుంచి తీసుకున్నాడు. బీడీని వెలిగిద్దామని అగ్గిపెట్టే కోసం చూసుకున్నాడు. తన దగ్గర లేకపోవడంతో దగ్గరలో ఉన్న నిద్రపోతున్న వ్యక్తిని అడిగాడు. తనను నిద్రలో నుంచి లేపడంతో కోపంతో కర్రతో కొట్టేందుకు యత్నించాడు. దీంతో అతను నిద్రపోగానే బండరాయితో హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా..  

విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావు భార్యాపిల్లలను వదిలేశాడు. తిరుపతిలో భిక్షాటన చేస్తున్నాడు. ఈ నెల 15న మహిళా వర్సిటీ బస్‌షెల్టర్‌లో నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో గుంతకల్లుకు చెందిన పాత నేరస్థుడు ఎ.మణిరత్నం అలియాస్‌ ఆర్ముగం అక్కడికి వచ్చాడు. అతను చిత్తు కాగితాలు ఏరుకుంటూ.. వాటిని అమ్ముకుని జీవిస్తున్నాడు. బీడీ వెలిగించుకునే అగ్గిపెట్టె కోసం లక్ష్మణరావును అడిగాడు. 

తాను మంచి నిద్రలో ఉండగా.. లేపినందుకు లక్ష్మణరావు కోపంతో మణిరత్నంను బండబూతులు తిట్టాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న కర్రతో అతడిని కొట్టేందుకు యత్నించాడు. అక్కడి నుంచి దూరంగా వెళ్లి మణిరత్నం.. లక్ష్మణరావు నిద్రపోయే వరకు చూశాడు. అతను నిద్రపోగానే.. బండరాయి తీసుకువచ్చి తలపై కొట్టి హత్య చేశాడు. 

తన బట్టలకు రక్తం అంటుకోగా.. వాటిని మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. గుర్తుతెలియని వృద్ధుడి హత్యగా కేసు నమోదు చేసిన ఎస్వీయూ పోలీసులు.. మృతుడి వద్ద ఆధారాలను సేకరించారు. నిందితుడిని మణిరత్నంగా గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 24న రైల్వేస్టేషన్‌ వద్ద అరెస్టు చేశారు. మణిరత్నంపై 2017లో మసీదులో హత్య చేసి ఆధారాలు చెరిపేసిన కేసు కూడా నమోదైనట్లు గుర్తించారు. అదేవిధంగా పలు దొంగతనాలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. 

Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్

Also Read: Benguluru: మహిళతో ఆ పనిచేస్తూ వ్యక్తి మృతి.. భర్త సాయంతో మృతదేహం మాయం   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News