తమిళనాట ( Tamilnadu ) ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికార పార్టీ ఏఐఏడీఎంకే ( AIADMK ) , ప్రతిపక్ష డీఎంకే ( DMK ) తో పాటు సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం సైతం బరిలో నిలవనుంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై కమల్ హాసన్ స్పష్టత ఇచ్చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 మేలో తమిళనాడు అసెంబ్లీ ( Tamilnadu Assembly Elections ) కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ వేడెక్కుతోంది. పార్టీల పొత్తుపై సమాలోచన సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు మరిన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ల పార్టీల పరిస్థితిపై అందరి దృష్టీ నెలకొంది. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీల వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు ఖుష్బూ బీజేపీలో చేరడం కూడా ఆ పార్టీకు లాభించే అంశంగా మారింది. 


ఈ నేపధ్యంలో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ( Kamal haasan ) స్థాపించిన ఎంఎన్ఎం ( MNM ) పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంటుందనే వార్తలు విన్పిస్తున్నాయి. దీనిపై కమల్ హాసన్ స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంటామనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని..ఎన్నికల అనంతరం మూడో అతిపెద్ద పార్టీగా ఎంఎన్ఎం అవతరిస్తుందని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో వస్తే లోక్ పాల్ చట్టం తీసుకురావడమే మొదటి ప్రాధాన్యతగా చెప్పారు. 


మనుస్మృతి ( Manusmriti ) పై కమల్ హాసన్ స్పందించారు. మనుస్మృతి చెలామణీలో లేనప్పుడు దానిపై చర్చ అనవసరమన్నారు. లోక్ సభ ఎంపీ మనుస్మృతి చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో వివాదం రేగింది. దీనిపై మాట్లాడిన కమల్ హాసన్..మనుస్మృతి అనేది సమాజానికి ప్రవర్తనా నియమావళి సూచించే పురాతన గ్రంధమని చెప్పారు. Also read: UGC NET Answer key: కీ విడుదల, అభ్యంతరాలు ఛాలెంజ్ చేసే విధానమిది