యూజీసీ నెట్ ఆన్సర్ కీ ( UGC NET ANSWER KEY ) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( National Testing Agency ) విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్దులు తమ సమాధానాన్ని కీ తో సరిపోల్చుకుని..సమస్యలుంటే..యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
2020 సెప్టెంబర్ 24, అక్టోబర్ 17 మధ్యలో UGC NET కు సంబంధించిన 55 సబ్జెక్టుల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం, సమాధానాల్ని విద్యార్ధులు ugcnet.nta.nic.in. వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి సరిచూసుకోవచ్చు. UGC NET 2020 కు సంబంధించిన కీ ను..పరీక్షల్ని నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) విడుదల చేసింది. కీ లో అభ్యంతరాలుంటే నవంబర్ 7 లోగా దాఖలు చేసుకోవల్సి ఉంటుంది.
పరీక్షలు రాసిన విద్యార్ధులు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి..అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాల్ని నమోదు చేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రశ్నాపత్రం, సమాధానపత్రంలో అభ్యంతరాల్ని మార్క్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఓ ప్రకటన విడుదల చేసింది. యూజీసీ నెట్ జూన్ 2020 పరీక్ష ప్రశ్నాపత్రాన్ని చెక్ చేయాలంటే అభ్యర్ధుల్ని దిగువన ఉదహరించిన అంశాల్ని పాటించాల్సి ఉంటుంది. Also read: JP Nadda: కరోనా విషయంలో ట్రంప్ విఫలం: బీజేపీ చీఫ్ నడ్డా
ముందుగా UGC NET ugcnet.nta.nic.in. అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. తరువాత హోమ్‌పేజీలో వ్యూ క్వశ్చన్ పేపర్/ఆన్సర్ కీ ఛాలెంజ్ పై క్లిక్ చేయాలి. ఇచ్చిన స్పేస్‌లో మీ పాస్‌వర్డ్ వంటి క్రెడెన్షియల్స్ ( Credentials ) ను టైప్ చేస్తే...యూజీసీ నెట్ ప్రశ్నాపత్రాలు కన్పిస్తాయి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకుంటే రిఫరెన్స్‌గా పని చేస్తుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in కు వెళ్లి..అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్ తో లాగిన్ కావాలి. ఆన్సర్ కీను చూసేందుకు లేదా అభ్యంతరాల్ని ఛాలెంజ్ చేయడానికి వ్యూ క్వశ్చన్ పేపర్ ను క్లిక్ చేయాలి. తరువాత వ్యూ/ఛాలెంజ్ ఆన్సర్ కీను క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్‌పై మీకు ఆర్డర్ ప్రకారం ఐడీలు కన్పిస్తాయి. కరెక్ట్ ఆప్షన్స్ కాలమ్ కింద ప్రశ్న తరువాత ఉన్న ఐడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించిన సరైన కీను చూపిస్తుంది. ఆప్షన్‌ను ఛాలెంజ్ చేయాలంటే..ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్ ఐడీలను చెక్ బాక్స్ లో క్లిక్ చేయాలి. మీకు కావల్సిన ఆప్షన్‌ను చెక్ చేసుకున్న తరువాత సేవ్ యువర్ క్లెయిమ్స్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మీరు ఛాలెంజ్ చేసిన ఆప్షన్ ఐడీలు స్క్రీన్ పై కన్పిస్తాయి. అది మీరు డౌన్‌లోడ్ చేసుకుని Choose File ఆప్షన్ ద్వారా తిరిగి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ యువర్ క్లెయిమ్స్ అండ్ పే ఫీ ద్వారా సంబంధిత ఫీజు చెల్లించాలి.
అభ్యంతరాల్ని ఛాలెంజ్ చేయడానికి ప్రతి సమాధానానికి వేయి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరం సరైందని తేలితే ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. పేమెంట్ ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ సౌకర్యముంది. Also read: Gold Seize: విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టివేత
UGC NET Answer key: కీ విడుదల, అభ్యంతరాలు ఛాలెంజ్ చేసే విధానమిది
UGC NET ANSWER KEY విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
ప్రతి అభ్యంతరానికి వేయి రూపాయలు ఫీ
సంప్రదించాల్సిన అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in