మహారాష్ట్రలో కరోనా వైరస్ ( Maharashtra corona virus cases )  మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మృతుల సంఖ్యతో మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను జూలై 31 వరకూ ( Lockdown extends till 31 july )  పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 వైరస్ మోగిస్తోన్న ప్రమాద ఘంటికల నేపధ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే అప్రమత్తమయ్యారు. మిషన్ బిగిన్ ఎగైన్ ( Mission began again )  కింద విడుదలైన తాాజా గైడ్ లైన్స్ ప్రకారం అత్యవసరం కాని సేవలపై  ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో జూలై 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నింటిపై ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయని గైడ్ లైౌన్స్ ( Lockdown new guidelines ) లో స్పష్టం చేశారు. కేవలం 15 శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని సూచించారు. 


Also read : మెట్రోరైలుకు అప్పుడే వద్దంటున్న జనం


దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రంలో కరోనా సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది. దేశంలో కరోనా కేసులు ఇప్పటివరకూ 5న్నర లక్షలు దాటగా...ఒక్క మహారాష్ట్రంలోనే 1 లక్షా 64 వేల 626 కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఇప్పటివరకూ 86 వేల 575 మంది చికిత్సతో కోలుకోగా...7 వేల 429 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 వేల 622 యాక్టివ్ కేసులున్నాయి. లాక్ డౌన్ అనంతరం కరోనా సంక్రమణ భారీగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


Also read : 99 ఏళ్ల వయస్సులో కరోనా నుంచి కోలుకున్న బామ్మ


భయపెడుతున్న ముంబాయి నగరం


రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో సగం కేసులు ఒక్క ముంబాయి నగరం ( Mumbai corona cases )  నుంచే ఉండటం భయం గొలుపుతోంది. నగరంలో కరోనా కేసుల సంఖ్య 75 వేల 539 కు చేరుకుంది.  గత 24 గంటల్లో కొత్తగా 23 మరణాలు, 1287 కొత్త కేసులు వెలుగుచూశాయి. నగరంలో ఇప్పటివకూ కరోనా కారణంగా 4 వేల 371 మంది మరణించారు.


Also read : దిల్లీలో మరో రెండ్రోజుల్లో ప్లాస్మా బ్యాంకు