భారీ వర్షాలు ( Heavy rains ) , వరద పరిస్థితులతో ( Floods ) తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ( Hyderabad ) పరిస్థితి ఛిద్రమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( pm Narendra modi ) ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మూడ్రోజుల్నించి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని వణికించేస్తున్నాయి.లోతట్టు ప్రాంతాల జలమయమై ప్రజా జీవనం స్థంబించుకోపోయింది. ప్రకాశం బ్యారేజ్ ( prakasam barrage ) కు భారీగా తరలివస్తున్న వరద ఉధృతితో కృష్ణా, గుంటూరు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.


అటు తెలంగాణలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ వరద ముప్పులో చిక్కుకుపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నాలాలు, వంకలు, నదులు పొంగి పొర్లుతూ..పక్కనున్న ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. కేవలం ఒక్కరోజులో హైదరాబాద్ నగరంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ఇళ్లు కూలిపోయాయి. కార్లు , బైకులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఇప్పటికే 15 మంది వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది.


ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ఆరా తీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) లకు ఫోన్ చేసి వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం తీరం దాటిందని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోదీకి జగన్ వివరించారు. అటు హైదరాబాద్ పరిస్థితిని కేసీఆర్...మోదీకు వివరించారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించిన మోదీ..కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. Also read: Kushboo: కుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు, రాష్ట్రంలోని 30 పోలీస్ స్టేషన్లలో కేసులు