తమిళ ఆరాధ్యనటి కుష్బూ ( Kushboo ) ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కేంద్రంలోని అధికారపార్టీ BJP తీర్ధం పుచ్చుకున్న 24 గంటల్లోనే 24కు పైగా కేసులు వచ్చి పడ్డాయి ఆమెపై. ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే కేసులకు కారణం.
ప్రముఖ నటి కుష్బుకు తమిళనాట ( Tamilnadu popular actress Kushboo ) ఉన్నఆదరణ చాలా ఎక్కువ. ఎంతంటే ఆమె బతికుండగానే ఆమెకో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ( Congress party ) లో ఉన్న ఆమె ఆ పార్టీకు ఓ అసెట్ గా నిలిచారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి..కేంద్రంలోని అధికారపార్టీ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరుకునపెడుతున్నాయి. బీజేపీలో చేరిన అనంతరం...మానసిక వికలాంగుల పార్టీ నుంచి తాను నిష్క్రమించానని కుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ..తమిళనాడు వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రకటించింది. రాష్ట్రంలోని 30 పోలీస్ స్టేషన్లపై ( 30 cases in police stations ) ఆమెపై కేసులు నమోదయ్యాయి. చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు అందింది. చెన్నై, కంజిపురం, చెంగల్ పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ వంటి ప్రాంతాల్లో కుష్బూపై ఫిర్యాదులు అందాయి.
కుష్బూ రాజకీయంగా తన ప్రత్యర్థులపై మాట్లాడేందుకు హక్కు కలిగి ఉన్నప్పటికీ.. వైకల్యం, ప్రతికూల చిత్రణను సూచించే పదాలను వాడడం ఆమోదయోగ్యం కాదని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఖండిస్తోంది. ఇలాంటి అవమానాలను చట్టం ద్వారా నిషేధించారనే విషయాన్ని దేశం, అటు కుష్బూ గుర్తుంచుకోవాలని జాతీయ వేదిక అంటోంది. Also read: Loan Moratorium: వడ్డీపై వడ్డీ మాఫీ..గుడ్ న్యూస్ అందించిన సుప్రీంకోర్టు