Punjab govt issues Unlock 5.0 guidelines: చండీఘడ్: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా పంజాబ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 15 తర్వాత కంటెమెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్న పంజాబ్ ప్రభుత్వం ( Punjab govt ).. అందులో భాగంగానే 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ( Schools reopening ) నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం పంజాబ్ సర్కార్ ఆదేశాలు సైతం జారీచేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి మేరకే వారిని పాఠశాలలు, కాలేజీలకు పిలవాల్సిందిగా విద్యా సంస్థలకు సూచించిన పంజాబ్ ప్రభుత్వం.. విద్యా సంస్థల్లో హాజరు తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. అదే సమయంలో ఆన్ లైన్ క్లాసెస్‌ని ప్రోత్సహించాల్సిందిగా తేల్చిచెప్పింది. Also read : Weather Updates: మరింత బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాఠశాలలు పునఃప్రారంభించాలనుకుంటున్న విద్యా సంస్థలు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు ( COVID-19 guidelines ) పాటించాల్సిందేనని పంజాబ్ ప్రభుత్వం స్పష్టంచేసింది. పై తరగతుల విషయానికొస్తే.. ప్రయోగశాలలో ప్రయోగాల అవసరం ఉన్న సైన్స్ విద్యార్థులను మాత్రమే విద్యా సంస్థల్లోకి అనుమతించాలని సూచించింది. 


విద్యా సంస్థలతో పాటు కోచింగ్ సెంటర్స్‌కి ( Coaching centres ) కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐతే, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ పాటించడం వంటి కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం షరతులు విధించింది. క్రీడాకారులకు ఉపయోగపడే స్విమ్మింగ్‌పూల్స్, బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్స్ ( B2B exhibitions ) వంటివి అక్టోబర్ 15 తర్వాత అనుమతించనున్నారు. Also read : RCB vs KKR match: 82 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుగా ఓడించిన బెంగళూరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe