Weather Updates: మరింత బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు

Deep depression in Bay of Bengal: విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారిజామున నర్సాపూర్, విశాఖపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

Last Updated : Oct 13, 2020, 01:46 AM IST
Weather Updates: మరింత బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు

Deep depression in Bay of Bengal: విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు తప్పేలా లేవు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారిజామున నర్సాపూర్, విశాఖపట్నం మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rain in Telangana ) కురవనున్నాయి. అలాగే రాయలసీమ, కర్ణాటక, దక్షిణ కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాట్వాడ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు ( Heavy rainfall ) కురిసే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. Also read : Heavy rain alert: హైదరాబాద్‌కి భారీ వర్షసూచన.. 3 రోజుల పాటు భారీ వర్షాలు

కోస్తాంధ్ర, ఒడిషా, మహారాష్ట్రలోని విదర్భలోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ ( IMD ) స్పష్టంచేసింది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం విశాఖపట్నం-నర్సాపూర్ మధ్య కాకినాడకు సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. 55-65 కిమీ నుండి 75 కి.మీ వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. Also read : Sunil Narine's bowling: సునీల్ నరైన్ బౌలింగ్‌పై KKR స్పందన

తుపాన్ హెచ్చరికల ( Cyclone alerts ) నేపథ్యంలో తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సిద్ధంగా ఉండాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ( AP govt ) స్పష్టంచేసింది. వాయుగుండం దిశను, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. Also read : AP: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News