Rahul on Twitter: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకు కోపమొచ్చింది. వ్యక్తిపై కాదు..సామాజిక మాధ్యమంపై. ట్విట్టర్‌పై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. అసలేం జరిగింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వర్సెస్ ట్విట్టర్ వివాదం పెద్దదవుతోంది. ట్విట్టర్ అక్కౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన కొద్దిరోజులకు ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూ ట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ట్విట్టర్ దేశ రాజకీయాల్లో తరదూరుస్తోందని మండిపడ్డారు. తన ట్విట్టర్ అక్కౌంట్‌ను బ్లాక్ చేయడమంటే..దేశ రాజకీయాల్లో తలదూర్చడమేనని..దేశ రాజకీయాలతో ఆ సంస్థ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. ట్విట్టర్ పక్షపాత దోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఓ రాజకీయ నేతగా తనకీ విషయం మింగుడుపడటం లేదన్నారు. ట్విట్టర్‌లో తనకు 2 కోట్లమంది ఫాలోవర్లు ఉన్నారని..తన అక్కౌంట్ బ్లాక్ చేయడమంటే వారి అభిప్రాయాల్ని వెల్లడించే అవకాశం లేకుండా చేయడమేనని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించారు. 


ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబసభ్యుల ఫోటోల్ని రాహుల్ ట్విట్టర్ అక్కౌంట్‌(Twitter)లో షేర్ చేయడం నిబంధనలకు విరుద్ధమనే కారణంతో ట్విట్టర్ అక్కౌంట్ బ్లాక్(Rahul gandhi twitter account blocked) చేసింది. మరోవైపు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ అత్యున్నత సంస్థ సైతం రాహుల్ గాంధీ..బాధిత కుటుంబసభ్యుల ఫోటోల్ని ఇన్‌స్టాలో షేర్ చేయడంపై మండిపడింది. ఇన్‌స్టా ఖాతాపై చర్యలు తీసుకోవాలని ఫేస్‌బుక్‌కు(Facebook) ఫిర్యాదు చేసింది. 


Also read: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం, హై అలర్ట్ ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook