దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం, హై అలర్ట్ ప్రకటన

Delhi Alert: పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపధ్యంలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో భారీ ఉగ్ర కుట్ర బట్టబయలైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2021, 11:31 AM IST
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం, హై అలర్ట్ ప్రకటన

Delhi Alert: పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపధ్యంలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో భారీ ఉగ్ర కుట్ర బట్టబయలైంది. 

దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని(Independence Day Celebrations) జరుపుకోబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ ఉగ్రకుట్ర (Terror Attack conspiracy)బట్టబయలైంది. ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి 55 పిస్తోళ్లు, 50 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్నించి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ క్యాట్రిడ్ద్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల సమీపించడం, భారీ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్(High Alert in Delhi) ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేలమంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలో ఎత్తైన భవనాలపై ఎస్ఎస్‌జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. ఆగస్టు 15వ(August 15) తేదీన ద్రోన్లు, బెలూన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. యాంటీ ద్రోన్ల వ్యవస్థ ఏర్పాటైంది. 

Also read: బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News