న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న అషీమ్ గుప్తా(56) సీనియర్ వైద్యుడు ఈ రోజు ఉదయం మరణించాడు. డాక్టర్ అషీమ్ గుప్తా, లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో చాలా కాలంగా అనస్థీషియా నిపుణుడిగా సేవలందిస్తున్నారు. కాగా ఈ ఆసుపత్రిని  COVID-19 ఆసుపత్రిగా ప్రకటించిన విషయం తెలిసిందే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కోటి దాటిన కరోనా కేసులు.. మరణాలు ఐదు లక్షలకుపైనే..


అయితే డాక్టర్ అషీమ్ గుప్తా గత రెండు వారాలుగా సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం నాడు ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని గంటల తరువాత ఆయన మరణించారని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా COVID-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పోరాటంలో ఆరోగ్య కార్యకర్తలకు గౌరవ చిహ్నంగా వైమానిక దళం ఆసుపత్రిలో పూలమాలలు వేసినప్పుడు మే 3న డాక్టర్ అషీమ్ గుప్తా కార్యక్రమాన్ని ముందుండి నడిపించారని సహచర వైద్యులు గుర్తు చేసుకున్నారు. జూన్ 30 నుంచి మార్కెట్లోకి Realme X3 స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్లు మీకోసం


Also Read: ఆకలినైన భరిస్తాం.. కానీ జొమాటోలో కొనసాగలేం..


డాక్టర్ అషీమ్ గుప్తాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య సైతం COVID-19 బారిన పడి కొద్ది రోజుల క్రితమే కోలుకుంది. అతని కుమారుడు ఒకరు ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతుండగా, మరొకరు మెడిసిన్ చదువుతున్నాడు. మార్చి 17న ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిని కోవిడ్ -19 ఆసుపత్రిగా ప్రకటించిన నాటి నుండి 2,700 మందికి పైగా కరోనావైరస్ రోగులకు విజయవంతంగా చికిత్స చేసి ఇంటికి పంపించిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల మహమ్మారి సమయంలో ఆసుపత్రిలో వైద్యులు చేసిన కృషిని ప్రశంసించారు. వైద్యులను ప్రశంసిస్తూ, కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో వైద్యులు ఇంటికి వెళ్లడం లేదని, కుటుంబ సభ్యులను కలుసుకోవడం లేదన్నారు. వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ వేడిలో PPE కిట్లు ధరించడం చాలా కష్టమని, మీకు ఏదైనా సమస్య ఎదురైతే మేము మీతో ఉన్నామంటూ భరోసానిచ్చారు. 80,000 కేసులతో దేశంలోనే అత్యధికంగా కరోనా బారిన పడిన నగరం ఢిల్లీ. ఇప్పటివరకు 2,500 మంది వైరస్ కారణంగా మరణించారు.
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ