కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute of india ) మరో కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం, మధ్య తరగతి వర్గీయులకు అందించే ప్రత్యేక ధరను నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ( Corona vaccine ) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీను ప్రారంభించగా..మిగిలిన దేశాల్లో వివిధ కంపెనీల వ్యాక్సిన్ లు  మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా ( Oxford0- Astrazeneca ) కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పై అందరి దృష్టీ నెలకొంది. ముఖ్యంగా ఇండియా ఈ వ్యాక్సిన్ వైపు చూస్తోంది. దీనికి కారణం ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ ఒప్పందం ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ తో అయింది. 


అందుకే ఇప్పుడు అందరి దృష్టి సీరమ్ ఇనిస్టిట్యూట్ పై ఉంది. ఈ తరుణంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదార్ పూణావాలా కీలక ప్రకటన చేశారు. వచ్చే యేడాది అంటే 2021 ప్రధమార్ధంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం సీరమ్ ఇనిసిట్యూట్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్ అండ్ మిలంద్‌ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తికి సీరమ్‌ ఇనిస్టిట్యూట్ శ్రీకారం చుట్టింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా  మధ్య తరగతివారి సౌలభ్యం కోసం ఒక్కో డోసు 250 రూపాయలుండేలా మిలంద్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించడానికి నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో పదికోట్ల డోసులకు ఒప్పందం చేసుకుంది. దీనికి అదనంగా మరో పది కోట్ల డోసుల్ని సిద్ధం చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. 


ఇక భారత్‌ బయోటెక్ ( Bharat biotech )‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ ( Covaxin ) సైతం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఐసీఎంఆర్ ( ICMR ) ‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ పరీక్షల్ని దేశంలోని 12 ప్రయోగ శాలల్లో నిర్వహిస్తున్నారు. Also read: Supreme court: ఇంకెంతకాలం నిర్బంధం? మీ ఉద్దేశ్యమేంటి ?