ప్రజా సంక్షేమ కార్యక్రమాలు..కరోనా వైరస్ ( Corona viurs ) పై పోరు ఇతరత్రా అంశాలు ఆ ముగ్గురిని టాప్ సీఎం ( Top cm’s ) లుగా నిలిపాయి. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్  సర్వేలో ఆ ముగ్గురూ టాప్ గా నిలవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మూడ్ ఆఫ్ ది నేషన్ ( Mood of the nation ) పేరుతో ఇండియా టుడే ఛానెల్ ( India today channel ) సర్వే నిర్వహిస్తుంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంల పనితీరుపై ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాల్ని ఇండియా టుడే సంస్థ జూలైలో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాను ( Best chief ministers list ) ఇండియా టుడే వెలువరించింది. ఈ జాబితాలో టాప్ లో అంటే ప్రధమ స్థానం పాలన, పనితీరు ఆధారంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ( Up cm yogi adithyanath ) కు దక్కింది. ఈ రెండు అంశాల్లో గతంలో కంటే మరింత మెరుగయ్యారని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. గతం కంటే ఆరు పాయింట్లను మెరుగుపర్చుకుని 24 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. 


ఇక ఇదే రెండు అంశాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Delhi cm Aravind kejriwal )  రెండో స్థానాన్ని సంపాదించారు. కేజ్రీవాల్ 15 శాతం ఓట్లతో యోగీ తరువాతి స్థానాన్ని సాధించారు. ఢిల్లీలో భారీగా పెరిగిన కోవిడ్ వైరస్ కేసుల కట్టడిలో కేజ్రీవాల్ పనితీరుకు ప్రజలు ఓట్లేశారని తెలుస్తోంది. 


ఇక దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ). తొలిసారి సీఎం అయినా సరే ఎంతో సమర్దవంతంగా కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కొంటున్నతీరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్న వైనంపై ఆయనకు బెస్ట్ ర్యాంక్ లభించింది. 11 శాతం ఓట్లతో వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. అత్యధికంగా కోవిడ్ 19 పరీక్షలు చేయడం, జూలైలో ఏకంగా వేయి ఆధునిక అంబులెన్స్ లను ప్రవేశపెట్టడం ప్రజల్లో జగన్ క్రేజ్ ను పెంచింది. Also read: Air India Flight Crash: 20కి చేరిన మృతుల సంఖ్య


ఇక గతంలో మెరుగైన స్థానంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr )  పరిస్థితి ఈసారి గణనీయంగా పడిపోయింది. కేవంల 3 శాతం ఓట్లతో దేశంలో 9వ స్థానంలో నిలిచారు. యోగీ, కేజ్రీవాల్, జగన్ లను ఏ కరోనా అంశమైతే టాప్ లో నిలబెట్టాయో అదే అంశం కేసీఆర్ ను దిగువకు పడిపోయేలా చేయడం గమనార్హం. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగో స్థానంలోనూ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 6వ స్థానంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే 7వ స్థానంలో, ఒడిస్సా సీఎం 8వ స్థానంలో, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 10 వ స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. Also read: Kozhikode flight crash: విమానం కూలిపోవడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణమా ?