Kozhikode flight crash: విమానం కూలిపోవడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణమా ?

ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటనే అంశాన్ని నిగ్గుతేల్చేందుకు పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ విమాన ప్రమాదానికి ఈ మూడు అంశాలే ప్రధాన కారణం అయి ఉండవచ్చా అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మూడు అనుమానాలు ఏంటంటే..

Last Updated : Aug 8, 2020, 10:14 AM IST
  • ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటనే కోణంలో దర్యాప్తు
  • ఈ మూడు అంశాలే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చా ?
  • Table top runway పద్ధతిలో జరిగిన కొజికోడ్ ఎయిర్ పోర్టు రన్ వే నిర్మాణం
  • టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటి ?
  • Black hole approach: బ్లాక్ హోల్ అప్రోచ్ అంటే ఏంటి ?
  • కొజికోడ్ విమాన ప్రమాదం వెనుక ఎన్నో సందేహాలు..
Kozhikode flight crash: విమానం కూలిపోవడానికి ఈ 3 అంశాలే ప్రధాన కారణమా ?

కొజికోడ్‌: ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటనే అంశాన్ని నిగ్గుతేల్చేందుకు పౌర విమానయాన శాఖ ( Ministry of Civil Aviation ) దర్యాప్తు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ విమాన ప్రమాదానికి ఈ మూడు అంశాలే ప్రధాన కారణం అయి ఉండవచ్చా అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మూడు అనుమానాలు ఏంటంటే.. ఒకటి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పైలట్స్‌కి స్టిమ్యులేటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రతీ పైలట్ శిక్షణ తీసుకుని వారు ఫిట్ అని నిర్ధారణ అయ్యాకే పైలట్స్ విమానం స్టీరింగ్ పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆ శిక్షణను సెప్టెంబర్ 30వ తేదీ వరకు వాయిదా వేశారు ( Pilots training postponed ). దీంతో ఆ శిక్షణ లేకుండానే పైలట్ విమానం నడపాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఏదైనా కారణాలతో సదరు పైలట్ సుశిక్షితుడు కానట్టయితే.. అతడు విమానం నడపడంలో కూడా అంతే అనర్హుడిగా భావించాల్సి ఉంటుంది. కొజికోడ్ విమాన ప్రమాదం విషయంలో ఇదే కానీ జరిగితే.. ఈ ప్రమాదానికి ఇదే ఒక కారణం కూడా అయ్యుండవచ్చనే విషయాన్ని కొట్టిపారేయలేం. Also read: AI flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 14 మంది మృతి

Salary cut for pilots పైలట్స్‌కి 60% జీతం కట్ ప్రభావం చూపించిందా ?
కొవిడ్ -19 వల్ల ఎదురైన ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి పైలట్స్‌ జీతాల్లో 60 శాతం కోత విధిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా సరిగ్గా గురువారమే వెలువడింది. ఏప్రిల్ 1 నుంచి ఈ జీతాల కోత వర్తిస్తుందని వెలువడిన ప్రకటన కచ్చితంగా పైలట్స్ ని మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ఉద్యోగి తన జీతంలోంచి 60 శాతం కోతకు గురైతుందంటే.. ఆందోళన చెందకుండా ఉంటారా ? అలా ఆందోళన చెందినప్పుడు వారు ఆత్మస్థైర్యం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలా ఏకాగ్రత కోల్పోయిన సమయంలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తే... అప్పుడు వారి విధులు వారు 100 శాతం న్యాయం చేసిన వాళ్లు ఎలా అవుతారు ? Also read: 
Flight crash: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే

Table top runway టేబుల్ టాప్ రన్వే:
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన క్యారిపూర్ విమానాశ్రయంలో ఉన్న రన్వే టేబుల్ టాప్ రన్వే అంటారు. సాధారణంగా ఇలాంటి రన్వేలపై రన్వేను సరిగ్గా గుర్తించడానికి మధ్యలో లైట్స్ ( Centre lights ) ఉంటాయి. రన్వేపై ల్యాండింగ్ అయ్యే సందర్భంలో రన్వేను సరిగ్గా అంచనా వేయడం కోసం ఈ సెంటర్ లైట్స్ ఉపయోగపడతాయి. కానీ క్యారిపూర్ రన్వేపై అలాంటి లైట్స్ ఏవీ లేవు. దీనినే బ్లాక్ హోల్ అప్రోచ్ ( Black Hole Approach ) అంటారు. ఇలాంటి చోట ఫ్లైట్ ల్యాండింగ్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఇలాంటి రన్వేలపై పెద్ద పెద్ద విమానాలను ల్యాండింగ్ కాలేవు. Also read: 
Flight accident: కేరళలో విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన విమానం

ఇటీవల ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. విమానం టెయిల్‌విండ్‌కి ( tailwind ) గురై ఉంటుందని.. దానికితోడు బ్లాక్ హోల్ అప్రోచ్ మరో ఇబ్బంది పెట్టడంతో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవడంతోనే రన్ వైపై నుంచి స్కిడ్ అవడానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Also read: Sanitisers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

Trending News