Mamata Challenge: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు , ప్రత్యారోపణలతో పాటు సవాళ్లు, ప్రతి సవాళ్లు అధికమౌతున్నాయి. తాజాగా దీదీ విసిరిన సవాల్‌తో బెంగాల్‌లో ఆసక్తి రేగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు( West Bengal Assembly Elections )మరో 2-3 నెలల్లో జరగనున్నాయి. టీఎంసీ, బీజేపీ( BJP )లు అప్పుడే ప్రచార పర్వానికి తెరతీసేశారు. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వేడి రాజుకుంది. నిన్నటి వరకూ ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు సవాళ్లతో నిండుతున్నాయి. పరవర్తన్ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీను టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే.  మేనల్లుడిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు మమతా  బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు.


అభిషేక్ బెనర్జీపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా ( Union minister amit shah )కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అమిత్ షా పోటీ చేయాలని సవాలు విసిరారు. ఆ తరువాత తన పై పోటీ చేయాల్సిందిగా కోరారు. దమ్ముంటే ముందుగా అభిషేక్ బెనర్జీపై పోటీ చేసి గెలవాలని కోరారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. రాజ్యసభకు వెళ్లే అవకాశమున్నా సరే..ప్రజాతీర్పు కోరి తన మేనల్లుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడని వివరించారు. అమిత్ షా విమర్శల్ని తిప్పికొట్టారు. తన మేనల్లుడిపై విమర్సలు చేసే ముందు మీ కుమారుడు 2019లో చేసిన పనిపై స్పందించాలని మమతా విమర్శించారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉండి కోట్లాది రూపాయలు దోచుకోలేదా అని మమతా బెనర్జీ ( Mamata Banerjee )ప్రశ్నించారు. అమిత్ షాకు తన కుమారుడిని రాజకీయాల్లో తీసుకొచ్చే దమ్ముందా అని అడిగారు. ఎన్నికలకు మరో 2-3 నెలల సమయం ఉండగానే...టీఎంసీ ( TMC ), బీజేపీల మధ్య వేడి రాజుకుంది. ఇక ఎన్నికలు సమీపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. 


Also read: 7th Pay Commission Latest News: 10వ తరగతి అర్హతతో Central govt jobs, నెలకు రూ. 56,900 వరకు జీతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook