7th Pay Commission Latest News: 10వ తరగతి అర్హతతో Central govt jobs, నెలకు రూ. 56,900 వరకు జీతం

7th Pay Commission Latest News: 10వ తరగతి చదువుకున్న వారికి ఇండియన్ నేవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Permanent central govt jobs offers అందిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారి నుంచి Tradesman Mate posts పోస్టులకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th CPC pay scale rules ప్రకారమే అర్హత కలిగి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో గ్రూప్-సి కింద నాన్-గెజిటెడ్ హోదాతో నెలకు కనీసం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు వేతనం అందనుంది.

Last Updated : Feb 18, 2021, 09:54 PM IST
7th Pay Commission Latest News: 10వ తరగతి అర్హతతో Central govt jobs, నెలకు రూ. 56,900 వరకు జీతం

7th Pay Commission Latest News: 10వ తరగతి చదువుకున్న వారికి ఇండియన్ నేవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Permanent central govt jobs offers అందిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారి నుంచి Tradesman Mate posts పోస్టులకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th CPC pay scale rules ప్రకారమే అర్హత కలిగి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో గ్రూప్-సి కింద నాన్-గెజిటెడ్ హోదాతో నెలకు కనీసం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు వేతనం అందనుంది. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా భర్తీ చేయనున్న ఈ సెంట్రల్ Central govt jobs కు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. 

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1159 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈస్టర్న్ కమాండ్, వెస్టెర్న్ కమాండ్, సౌతెర్న్ కమాండ్ మూడింటిలో కలిపి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఇండియన్ నేవీ ప్రకటించింది. 

Age limit - వయస్సు పరిమితి:
Indian Navy Tradesman Mate Post ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. 

ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్స్ పరిధిలోని పరిపాలక విభాగంలో సేవలు అందించాల్సి ఉంటుందని ఇండియన్ నేవీ పేర్కొంది. అయితే, అదే సమయంలో ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీ తమ అవసరాలకు అనుగుణంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని నేవీ వెల్లడించింది. 

Also read : EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం

Indian Navy Recruitment 2021: Vacancy Details
Eastern Naval Command - ఈస్టర్న్ నేవల్ కమాండ్: 710 Posts
Western Naval Command - వెస్టర్న్ నేవల్ కమాండ్: 324 Posts
Southern Naval Command - సౌతెర్న్ నేవల్ కమాండ్: 125 Posts

Eligibility Criteria - కావాల్సిన అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డ్ లేదా విద్యా సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు ITI లో సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలి.

Indian Navy Recruitment 2021: Selection Process
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు online computer examination కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇండియన్ నేవీలో పనిచేసేందుకు తప్పనిసరిగా అవసరమైన అర్హతల గురించి ఈ Online exam లో ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించే ఈ ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన డేట్, టైమ్, ఎగ్జామ్ సెంటర్ వివరాలను మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా వెల్లడించనున్నట్టు Indian Navy స్పష్టంచేసింది. 

Indian Navy Recruitment 2021: Application fees
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు Net banking / Visa / Master / RuPay Credit / Debit Card/ UPI transactions ద్వారా రూ. 205 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

Also read : LIC policy holders: ఎల్ఐసి పాలసీ హోల్డర్స్‌కి Good news.. LIC IPO వీళ్లకే ప్రాధాన్యత

వీళ్లకు Application fees మినహాయింపు:
SC / ST / PwBDs / Ex-Servicemen తో పాటు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఇండియన్ నేవీ తేల్చిచెప్పింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News