Glowing Skin in Summer: ఎండకాలం మీ ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇదే బెస్ట్ హోం రెమిడీ..
Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది.
Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది. అయితే, 5 హోం రెమిడీలతో ఇంట్లోనే ట్యాన్ వదిలించుకోవచ్చు. ఫలితంగా మీ ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.
తేనె, నిమ్మకాయ..
తేనె, నిమ్మకాయ రెండిటినీ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మాన్ని ఇది సహజసిద్ధంగా కాంతివంతం చేస్తుంది. తేనె, నిమ్మకాయ వల్ల చర్మం మెత్తగా మారుతుంది. రెండు టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకోవాలి. దీన్ని ముఖం ట్యాన్ అయిన ప్రదేశంలో అప్లై చేసుకుని ఓ 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు..
పసుపు నేచురల్ గా ముఖానికి అందాన్ని పెంచుతుంది. ఒక చిటికెడు పసుపు, నిమ్మకాయ రసం, పచ్చిపాలు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
యోగర్ట్, శనగపిండి..
యోగర్ట్, శనగపిండి రెండిటిలో ఎక్స్‌ఫోలియేటింగ్, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలపాలి. ఒక చెంచా శనగపిండి, యోగర్ట్ వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. పెరుగు ముఖాన్ని చల్లగా, సాఫ్ట్‌గా తయారు చేస్తుంది. ఇక శనగపిండి ముఖం ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది. దీంతో ముఖానికి నేచురల్ గ్లో వస్తుంది.
ఇదీ చదవండి: బియ్యం పిండితో ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోండి.. ముఖానికి రెట్టింపు రంగు వస్తుంది..
కలబంద..
కలబంద సమ్మర్ స్కిన్ కేర్ రోటీన్‌లో చేర్చుకోవడం మంచిది. అలోవెరా మొక్క నుంచి కలబందను తీయాలి. దీన్ని ట్యాన్ ఉన్న ప్రదేశంలో రుద్దుకుంటే సరిపోతుంది. కలబంద ముఖంపై దురద తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుతుంది.
ఇదీ చదవండి: పెసరపప్పు 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. లొట్టలేసుకుని డైలీ తింటారు..
బాదం..
బాదంతో తయారు చేసే రిసిపీలు టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మీ ముఖంపై ఉన్న ట్యాన్ కూడా తొలగిస్తుంది. బాదం రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టాలి. దీన్ని పాలతో మిక్స్ చేసి బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది స్మూత్ పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖం ట్యాన్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి. బాదంలో యాంటీ ఆక్సిడేంట్ గుణాలు ట్యాన్ తొలగించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ రెమిడీ ట్రై చేస్తే రెండు వారాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook