Rice Flour Scrub: బియ్యం పిండితో ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోండి.. ముఖానికి రెట్టింపు రంగు వస్తుంది..

Rice Flour Scrub for Glowing Skin: బియ్యం పిండితో ముఖానికి రకరకాల ఫేస్‌ ప్యాకులను తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్‌ ముఖంపై ఉన్న నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.  

Written by - Renuka Godugu | Last Updated : Apr 18, 2024, 09:57 AM IST
Rice Flour Scrub: బియ్యం పిండితో ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోండి.. ముఖానికి రెట్టింపు రంగు వస్తుంది..

Rice Flour Scrub for Glowing Skin: బియ్యం పిండితో ముఖానికి రకరకాల ఫేస్‌ ప్యాకులను తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం రెట్టింపు కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్‌ ముఖంపై ఉన్న నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది.  బియ్యంపండిలో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ రంగును మెరుగుపరుస్తుంది. అంతేకాదు బియ్యం పిండిలో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంపై ఉన్న డెడ్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. ముఖంపై ఉన్న అధిక నూనెను తగ్గిస్తుంది. ముఖ రంధ్రాలను తొలగించి రీఫ్రెష్‌ ఇస్తుంది.

బియ్యం పండి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. స్కిన్‌ టోన్ కూడా మెరుగవుతుంది. ఇందులో ఎక్స్‌ఫొలియేషన్‌ గుణాలు ఉంటాయి అంతేకాదు బియ్యం పిండి ముఖంపై ఉన్న ఆయిల్ ను గ్రహిస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది.

రైస్‌ ఫేస్‌ స్క్రబ్ కోసం కావాల్సిన పదార్థాలు..
బియ్యం పిండి
తేనె
నిమ్మరసం
రోజ్‌ వాటర్
ఎసెన్షియల్ ఆయిల్

ఇదీ చదవండి: పెసరపప్పు 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. లొట్టలేసుకుని డైలీ తింటారు..

బియ్యం పిండితో ఫేస్‌ స్ర్కబ్‌ తయారీ విధానం..
బియ్యం పండి, తేనె, నిమ్మరసం ఒక బౌల్‌ లోకి తీసుకుని కలుపుకోవాలి. ఇది మంచి చిక్కని టెక్చర్ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి. ఇందులో రోజ్‌ వాటర్‌ కూడా వేసి పేస్ట్‌ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇదీ చదవండి: ముఖానికి రెట్టింపు గ్లో ఇచ్చే 7 సీరమ్స్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..

ఇందులో సువాసన కోసం మీకు కావాలంటే ఎసెన్షియల్‌ ఆయిల్‌ కూడా కలుపుకోవచ్చు. అంటే లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు.
ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం క్లెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ముఖంపై ఉన్న పోర్స్‌ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత చేతివేళ్ల సహాయంతో మృదువుగా పేస్టును ముఖానికి స్క్రబ్ చేయాలి. ఒక రెండు నిమిషాలపాటు కళ్ల ఏరియాను వదిలేసి స్క్రబ్‌ చేసుకోవాలి. ఓ 5 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే కూల్ వాటర్ కూడా వేసి ముఖం కడగాలి అప్పుడు పోర్స్‌ మూసుకుపోతాయి. మంచి ఫలితాలు పొందాలంటే వారానికి మూడుసార్లు స్క్రబ్ చేయండి. దీంతో మీ ముఖం స్మూత్‌గా, కాంతివంతంగా మారుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News