కొరియావాళ్లను ఎప్పుడైనా జాగ్రత్తగా చూశారా ? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. వాళ్ల ముఖంలో ఒకరకమైన మెరుపు ( Glowing Skin ) ఉంటుంది. అందుకే కొరియా సీరియల్ స్టార్స్ ( Korean Stars ), పాప్ స్టార్స్, మోడల్స్ ను మన దేశం వాళ్లు కూడా విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఈ రోజు వాళ్లు అంత అందంగా (Beautiful ) కనిపించడం వెనక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.



మంచి నిద్ర ( Sound Sleep ) వల్ల శరీరానికి సరికొత్త శక్తి  లభించడమే కాదు. అందం కూడా పెరుగుతుంది. ఇది కొరియా  వాసులకు బాగా తెలుసు అందుకే వాళ్లు నిద్ర విషయంలో కాంప్రమైజ్ కారు. ఇలా  వారిలా స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ ( Smart and Beautiful ) కనిపించాలంటే ఏం చేయాలో ఈ టిప్స్ చదివి తెలుసుకోండి.



 


ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మంచి నీళ్లతో ముఖం ( Facewash ) శుభ్రపరుచుకోవాలి. కేవలం నీటితో మాత్రమే కడగాలి.. క్లెన్సర్లు వాడరాదు.


ఫేస్  వాష్ తరువాత టోనర్ ( Toner ) వినియోగించాలి. దీని కోసం కాటన్ ను లేదా మీ అరచేతులను వినియోగించాలి. ఇది మీ స్కిన్ లో ఉన్న పీహెచ్ స్థాయులను రక్షిస్తుంది. 


దాంతో పాటు ఎస్సెన్స్ సీరమ్ ( Essence Serum ) ను వాడాలి. ఇందులో టోనర్, మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. దీన్ని అరచేతితో అప్లై చేయాలి కానీ వేళ్లు వాడకూడదు


మన చర్మానికి తగిన సీరంను ఎంచుకోవాలి. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు, డార్క్ సర్కిల్స్ ( Dark Circles ), డ్రైన్ స్కిన్  వంటి సమస్యలు తొలగిపోతాయి.



కంటి కింద భాగంలో మెరుపు కోసం ముఖానికి వాడే ఫేస్  క్రీమ్ ( Facecream ) లను కాకుండా ఐ క్రీమ్ వాడాలి. దీన్ని వేలి చివరిన తీసుకుని కంటి మొదలు నుంచి చివరి వరకు అప్లై చేయాలి. కంటికి టచ్ కాకుండా చూసుకోవాలి. 


మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోని మాయిశ్చరైజర్ ( Moisturizer ) ను ఎంచుకోవాలి. ఎందుకంటే  చర్మం కాంతి వంతం ( Glowing Skin ) అవ్వడంతో మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. 



చివరిగా సన్  స్రీన్  లోషన్ ( Sunscreen Lotion ) ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది  యూవీ రేయ్స్ ( UV Rays  ) టాన్ నుంచి, ముడతల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.


ఈ చిట్కాలు మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. కానీ  గుర్తుంచుకోండి.. అందం ఊరికే రాదు. అందంగా ఉండాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడాలి కదా.