డీ మోనిటైజేషన్ ( Demonetisation ) అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయనడంలో సందేహం లేదు. ఈ రంగంలో దూసుకుపోతున్న పేటీఎం ( Paytm ) ఇప్పుడు క్రెడిట్ కార్డులు ప్రవేశపెడుతోంది. భారీ లక్ష్యంతో మార్కెట్లో దిగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మార్కెట్లో ఇప్పటికే వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డు ( Credit cards ) లు అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంకా క్రెడిట్ కార్డు మార్కెట్ లో స్పేస్ ( Space in credit card market ) కన్పిస్తోంది. ఈ స్పేస్ ను లక్ష్యంగా చేసుకుంది ప్రముఖ డిజిటల్ ఫైనాన్సింగ్ ప్లాట్ ఫారమ్ పేటీఎం ( Digital Financing platform paytm ) . ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మార్కెట్ పై దృష్టి పెట్టింది. క్రెడిట్ కార్డు అందిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఆర్గనేజేషన్ బహుశా ఇదేనేమో. ఈ రంగంలో ఉన్న స్పేస్ ను చేజిక్కించుకోడానికి సరికొత్ ప్రణాళికతో వస్తోంది.


అందుబాటులో ఉన్న కార్డులకు భిన్నంగా ఎక్కువ ఫీచర్లతో కార్డును ప్రవేశపెడుతోంది. అందుకే వినూత్నంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్టు ( Co Branded credit card ) కు రూపకల్పన చేసింది పేటీఎం. దీనికోసం భారీ లక్ష్యం కూడా పెట్టుకుంది. ఏడాదిన్నర వ్యవధిలో ఏకంగా 20 లక్షల క్రెడిట్ కార్డుల్ని జారీ చేయాలనేది పేటీఎం వ్యూహంగా ఉంది. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేయాలనేది ఆలోచన. ఇప్పటికే డిజిటల్ లావాదేవీల్లో పేటీఎం అగ్రగామిగా ఉంది.


దీనికోసం పేటీఎం సంస్థ వివిధ బ్యాంకులతో చర్చించింది. క్రెడిట్ కార్డును యాప్ ద్వారానే అప్లై చేసుకునే సౌకర్యం కల్పించింది. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండేవిధంగా కార్డును రూపొందుతోంది. పేటీఎం అందించే క్రెడిట్ కార్డులో ఇన్‌స్టంట్ వన్ టచ్ ఫీచర్స్ ఉంటాయి. సెక్యూరిటీ పిన్ నెంబర్, అప్డేట్ అడ్రస్, బ్లాక్ కార్డ్, ఇష్యూ డూప్లికేట్ కార్డ్, కార్డ్ బిల్లు వంటి సర్వీసులన్నీ ఉంటాయి. అంతకుమించి కార్డును ఆన్ ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. పేటీఎం కార్డుతో  అంతర్జాతీయ లావాదేవీలు కూడా చేసుకునే సౌకర్యముంటుంది. Also read: Wireless Charger: త్వరలో సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్లు


సాధారణంగా ఇతర బ్యాంకులు షాపింగ్ ద్వారా అందించే రివార్డు పాయింట్లకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కానీ పేటీఎం క్రెడిట్ కార్డు ( Paytm credit card ) ద్వారా లభించే రివార్డు పాయింట్లకతు ఎక్స్ పైరీ అనేది ఉండదు. ఎప్పుడైనా ఎక్కడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. పేటీఎం క్రెడిట్ కార్డుపై భీమా సేవల్ని కూడా పొందవచ్చు.


ఫిన్ టెక్ ( Fintech ) సంస్థను పేటీఎం ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేసుకుంది. ఇండస్ ఇండ్ బ్యాంకు ( IndusInd Bank ) తొలిసారిగా ప్రవేశపెట్టిన ఫస్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డు ( First Generation credit card ) తరహాలో పేటీఎం కార్డులు ఉండబోతున్నాయి. యూఎస్ క్రెడిట్ కార్డ్ మార్కెట్ తో పోలిస్తే ఇండియాలో ఇప్పటికీ చాలా స్పేస్ ఉంది ఈ రంగంలో. ఓ వర్గం వారికి మాత్రమే క్రెడిట్ కార్డు లభిస్తోంది..అందరికీ దక్కదనే అభిప్రాయం ఉంది. . ఇండియాలో క్రెడిట్ కార్డు మార్కెట్ వాటా కేవలం 3 శాతం మాత్రమే. అయితే పేటీఎం ఇందుకు భిన్నంగా అందరికీ క్రెడిట్ కార్డు అందించే ఉద్దేశ్యంతో మార్కెట్లో ఈ కొత్త తరహా కార్డు ప్రవేశపెడుతోంది. Also read: Xiaomi: సూపర్ ఫీచర్స్ తో వైర్ లెస్ ఇయర్ బడ్స్..ధర ఎంతో తెలుసా