Xiaomi: సూపర్ ఫీచర్స్ తో వైర్ లెస్ ఇయర్ బడ్స్..ధర ఎంతో తెలుసా

స్మార్ట్ ఫోన్ అయినా..స్మార్ట్ ఫోన్ యాక్సెసరీస్ అయినా సరే షియోమీనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్ ను ప్రవేశపెట్టిన షియోమీ ఇప్పుడు సూపర్ ఫీచర్స్ కలిగిన ఇయర్ బడ్స్ రంగంలో దింపుతోంది.

Last Updated : Oct 20, 2020, 02:08 PM IST
Xiaomi:  సూపర్ ఫీచర్స్ తో వైర్ లెస్ ఇయర్ బడ్స్..ధర ఎంతో తెలుసా

స్మార్ట్ ఫోన్ ( Smart phone ) అయినా..స్మార్ట్ ఫోన్ యాక్సెసరీస్ ( Smart phone Accessories ) అయినా సరే షియోమీ ( Xiaomi ) నే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్ ను ప్రవేశపెట్టిన షియోమీ ఇప్పుడు సూపర్ ఫీచర్స్ కలిగిన ఇయర్ బడ్స్ రంగంలో దింపుతోంది.

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ..అంతా స్మార్టే. అందుకే ఈ ఉత్పత్తులతో పాటు వీటి  యాక్సెసరీస్ కు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్లతో పాటు యాక్సెసరీస్ లో కూడా చైనా కంపెనీలు ముందంజలో ఉంటున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది షియోమీ గురించి. తాజాగా సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్ ( Super fast wireless charger ) ను మార్కెట్లో దింపి సంచలనం సృష్టిస్తోన్న షియోమీ ఇప్పుడు మరో ఉత్పత్తిని దింపుతోంది. 

అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ ఎయిర్ 2 ప్రొ ( MI Air 2 pro ) పేరుతో వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎప్పడదేని ఇంకా ప్రకటించలేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో ఉన్న ఈ ఇయర్ బడ్స్ చైనాలో ప్రస్తుతం 7 వేల 8 వందలకు లభ్యమవుతున్నాయి.

ఈ సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు 3 - మైక్ హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్, 35 డెసిబుల్‌ వరకు సౌండ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. అంతేకాక, ఇందులో మెరుగైన బేస్ , సౌండ్ క్వాలిటీ కోసం 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించినట్లు షియోమీ సంస్థ వెల్లడించింది. ఎంఐ ఎయిర్ 2 ప్రో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లో సిలికాన్ ఇయర్ టిప్స్ , స్టెమ్ డిజైన్డ్ ఇయర్ బడ్స్  ఉంటాయి. కేస్ డిజైన్ ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2 ను పోలి ఉంటుందని షియోమీ పేర్కొంది. ఈ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేసుతో పాటు దాదాపు 28 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో రానుంది.  ఛార్జింగ్ కేస్ లేకుండానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఏకంగా 7 గంటల వరకు పని చేస్తుందని షియోమీ తెలిపింది. 

ఈ ఇయర్ బడ్స్ ఫుల్ ఛార్జ్ కావడానికి ఓ గంట సమయం పట్టినా కేవలం 10 నిమిషాల పాటు ఛార్జింగ్ తో  90 నిమిషాల ప్లే బ్యాక్ టైం పొందవచ్చు. అంతేకాదు ఈ ఇయర్ బడ్స్ ఆపరేటింగ్ డిస్టెన్స్ కూడా ఎక్కువే ఉంది. పది మీటర్ల వరకూ పని చేస్తాయి. అతి తక్కువ బరువు కేవలం 60 గ్రాములు మాత్రమే ఉండటంతో అత్యంత సౌకర్యంగా ఉంటుంది.  Also read: https://zeenews.india.com/telugu/social/xiaomi-launching-the-new-fastest-wireless-charging-technology-30299Wireless Charger: త్వరలో సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్లు

Trending News