Wireless Charger: త్వరలో సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ దిగ్గజమైన షియోమీ మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. అత్యంత వేగంగా నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే..వైర్ లెస్ టెక్నాలజీను అందుబాటులోకి తెచ్చింది.

Last Updated : Oct 19, 2020, 07:31 PM IST
Wireless Charger: త్వరలో సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ మొబైల్ ఫోన్లు

స్మార్ట్ ఫోన్ ( Smart phone ) దిగ్గజమైన షియోమీ ( Xiaomi ) మరో కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. అత్యంత వేగంగా నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే..వైర్ లెస్ టెక్నాలజీను అందుబాటులోకి తెచ్చింది.

ఎంఐ ఫోన్ల ( MI Phones ) తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ( Smart phone market ) లో సంచలనం కల్గిస్తున్న షియోమీ మరో కొత్త ప్రొడక్ట్ కు శ్రీకారం చుట్టింది. అత్యంత వేగంగా నిమిషాల వ్యవధిలోనే ఛార్జ్ అయ్యే వైర్ లెస్ టెక్నాలజీ ( Fastest Wireless charger ) ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో 4 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ( 4000 MAH Battery ) ను కేవలం 19 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యేలా వైర్ లెస్  ఛార్జర్ ను ప్రవేశపెడుతున్నట్టు షియోమీ ప్రకటించడం సంచలనంగా మారింది. 80W వైర్ లెస్ ఛార్జింగ్ తో ఇది సాధ్యమవుతుంది.  షియోమీ తన యూట్యూబ్ ఛానల్ లో మోడిఫై చేసిన ఎంఐ 10 ప్రో మొబైల్ ఫోన్  వీడియోను పోస్టు చేసింది. షియోమీ పోస్టు చేసిన వీడియోలో 80W వైర్ లెస్ ఛార్జింగ్ ద్వారా 4 వేల ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 19 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయినట్లు చూపిస్తోంది.

అయితే ఈ ఫీచర్ తో షియోమీ సంస్థ ఏ మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తుందన్నది ఇంకా తెలియలేదు. త్వరలో ప్రవేశపెట్టబోయే మొబైల్ ఫోన్లకు వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుందని మాత్రం వెల్లడించింది. 

వైర్ లెస్ ఛార్జింగ్ తో సరికొత్త ఒరవడిని తీసుకుని రానున్నామని షియోమీ తెలిపింది.  పది శాతం ఛార్జింగ్ కు కేవలం 1 నిమిషం తీసుకోగా...50 శాతం పూర్తవడానికి 8 నిమిషాల సమయం పట్టింది. ఇక ఫుల్ ఛార్జ్ అవడానికి 19 నిమిషాల సమయం పట్టింది. ఇప్పుడీ కొత్త టెక్నాలజీ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. Also read: JIO: రిలయన్స్ ప్రవేశపెడుతున్న 5జీ మొబైల్ ధర ఎంతో తెలుసా

Trending News