ప్రపంచానికి కరోనావైరస్ ( Coronavirus ) పరిచయం చేసి..కోవిడ్-19 వైరస్ కు పురిటి గడ్డ అయిన వుహాన్ లో ప్రజలు పార్టీలు చేసుకుంటున్నారు. వాటర్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు. జలకాలాటలు ఆడుతున్నారు. రంగురంగు నియాన్లైట్స్, డిస్కో లైట్స్ మధ్య తాగితూలున్నారు. రకరకాల మాంసాహారాన్ని భుజిస్తున్నారు.



మామూలు సమయంలో అయితే ఈ వీడియోకు (Viral Video ) అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ కరోనావైరస్ ను నియంత్రించే అవకాశం ఉన్నా... అలా చేయకుండా ప్రపంచ వేగానికి ముందరికాళ్లకు బంధం వేసినట్టు చేసిన నగరం వుహాన్ . కోవిడ్- 19 వల్ల యావత్తు ప్రపంచం వణికిపోతుంటే.. వుహాన్ వాసులు మాత్రం జల్సల్లో, మత్తులో తూగిపోతున్నారు. దీనికి సంబంధిచిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ( Social Media )  బాగా వైరల్ అవుతున్నాయి.




వుహాన్ వాసులు పార్టీని చూసిన నెటిజెన్స్ (Netizens ) చైనాను దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా వుహాన్ వాసులను బాగా తిడుతున్నారు. కొంత మంది మాత్రం చైనా తప్పేం ఉంది అని సమర్థిస్తున్నారు.  మరికొంత మంది చైనా ఈ విషయంపై ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటున్నారు. ఫైనల్ గా ఈ వీడియో చూస్తే చాలా మందికి చైనాపై మరింత కోపం పెరుగుతోంది.